జహీరాబాద్‌ మార్కెట్‌కు ధనియాలు | - | Sakshi
Sakshi News home page

జహీరాబాద్‌ మార్కెట్‌కు ధనియాలు

Mar 16 2026 8:57 AM | Updated on Mar 16 2026 8:57 AM

జహీరాబాద్‌ టౌన్‌: పెద్ద పంటలతో నష్టపోతున్న రైతులకు చిన్న పంటలు ఆసరా అవుతున్నాయి. స్వల్పకాలంలోనే చేతికందుతూ గట్టెక్కిస్తున్నాయి. చిన్న పంటల్లో ప్రధానమైంది సుగంధ ద్రవ్యాల్లో ముఖ్యమైన ధనియాలు రైతులను ఆదుకుంటుంది. వంద రోజుల పంట అయిన ధనియాల సీజన్‌ కావడంతో జహీరాబాద్‌ మార్కెట్‌కు అమ్మకానికి రైతులు తీసుకొస్తున్నారు. పట్టణంలోని సుభాష్‌గంజ్‌ మార్కెట్‌లో క్రయవిక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ప్రారంభంలో క్వింటాల్‌కు నాణ్యతను బట్టి రూ.10 వేల పలికింది. మార్కెట్‌లో ధరలు రోజుకు మారుతుంటాయి. పెద్ద మొత్తంలో పంట రావడంతో ప్రస్తుతం ధరలు పడిపోయాయి. ప్రస్తుతం ధనియాలు సుమారు. రూ.6 వేల క్వింటాల్‌ పలుకుతుంది.

గీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

గీత కార్మికుల సంఘం

జిల్లా అధ్యక్షుడు ఆశన్నగౌడ్‌

సంగారెడ్డి టౌన్‌: గీతకార్మికుల సమస్యలు పరిష్కరించాలని గీత కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఆశన్న గౌడ్‌ డిమాండ్‌ చేశారు. వారి సమస్యల పరిష్కారానికి ఈ నెల 17న ఇందిరా పార్క్‌ వద్ద నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..బడ్జెట్లో గీత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం రూ.5000 కోట్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రమేశ్‌గౌడ్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జంగన్నగౌడ్‌, జిల్లా కమిటీ సభ్యులు శ్రీనివాస్‌గౌడ్‌, రవీందర్‌గౌడ్‌, మల్లేశంగౌడ్‌, యాదగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

అన్నివర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

నారాయణఖేడ్‌: అన్నివర్గాల సంక్షేమమే ప్రభు త్వ లక్ష్యమని ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు. ఖేడ్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణలో ఆదివారం మున్సిపల్‌ చైర్మన్‌ నగేశ్‌ షెట్కార్‌ కలిసి ఆయన ముస్లింలకు రంజాన్‌ తోఫాలను పంపిణీ చేశారు. అనంతరం జూకల్‌ శివారులోని కన్వెన్షన్‌ హాల్‌లో డివిజన్‌ పరిధి లోని 228 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను పంపిణీ చేశారు. మనూరు మండలం మాయికోడ్‌, రాణాపూర్‌ గ్రామాల్లో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న మహిళా సమాఖ్య భవనాలు, నాగల్‌గిద్ద మండల కేంద్రంలో మహిళా సమాఖ్య భవనంతోపాటు పాఠశాల ప్రహరీ నిర్మాణాలకు ఎమ్మె ల్యే శంఖుస్థాపనలు చేశారు. ఆయా కార్యక్రమా ల్లో ఆయన మాట్లాడుతూ.. ప్రజాపాలన ప్రభు త్వం అన్నిమతాలు, సాంప్రదాయాలను గౌరవి స్తూ అందరికీ సంక్షేమ పథకాలను చేరు వ చేస్తోందన్నారు. మహిళలు ప్రభుత్వం అందజేస్తున్న పథకాలు, డ్వాక్రా రుణాలను సద్విని యోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని కోరారు.

వేప పువ్వు గగనమేనా!

జహీరాబాద్‌ టౌన్‌: తెలుగు ప్రజలు ఉగాది పర్వదినాన్ని ఘనంగా జరుపుకుంటారు. పండుగ సందర్భంగా తయారు చేసే ఉగాది పచ్చడిలో ఎన్నో ప్రత్యేకతలుంటాయి. షడ్రుచుల సమ్మేళనంగా ఉండే పచ్చడిలో తీపి, ఒగరు, చేదు రుచులకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. పచ్చడిలో చేదు రుచి రావాలంటే అందులో కచ్చితంగా వేప పువ్వు వాడాల్సిందే. ఉగాది పండుగ ఇంకా వారం రోజులు మాత్రమే ఉంది. ఈ ఏడాది పండుగకు వేప పువ్వు కొరత ఏర్పడింది. వేప చెటున్నా పువ్వు మాత్రం కనిపించడం లేదు. ఈ ఏడాది వేపాకులు ఎండి రాలిపోయాయి. రెండు మూడేళ్ల క్రితం ఇలాంటి పరిస్థితి ఉండగా ఈసారి పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. ఫంగస్‌, తెగుళ్ల వల్ల వేపాకులు ఎండిపోయాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే కొన్ని చోట్ల ఆకులు చిగురించి పూర్వస్థితికి వసుండగా..పూత మాత్రం రావడం లేదు. పట్టణంలోని జర్నలిస్టు కాలనీలో గల ఒక్క వేప చెట్టుకు మాత్రం పువ్వు నిండుగా వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement