కాంగ్రెస్‌పై మాజీమంత్రి హరీశ్‌రావు ధ్వజం
పటాన్‌చెరు టౌన్: కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను కేవలం ఓటు బ్యాంక్‌గా వాడుకుంటుందని, ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చిన రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలను మోసం చేసినట్లే, బీసీలకు ద్రోహం చేశాడని మాజీమంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. హైదరాబాద్ కోకాపేట్‌లోని ఆదివారం హరీశ్‌రావు నివాసంలో పటాన్‌చెరు నియోజకవర్గ కో ఆర్డినేటర్ ఆదర్శ్‌రెడ్డి, పటాన్‌చెరు మండల ఇన్‌చార్జ్, జెడ్పీటీసీ మాజీ సభ్యులు శ్రీకాంత్‌గౌడ్ ఆధ్వర్యంలో క్యాసారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హరీశ్‌రావు సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీ లో చేరారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ...ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన బీసీ డిక్లరేషన్‌కు అతీగతీలేకుండా పోయిందన్నారు. ఏటా 20 వేల కోట్ల చొప్పున 5 ఏళ్లలో లక్ష కోట్లు బీసీల కోసం ఖర్చు చేస్తామని మాట తప్పారని విమర్శించారు. బడ్జెట్ లో నిధులు కేటాయించకపోవడం వల్ల బీసీ వర్గాల ప్రజల అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారిందన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు హామీ ఇచ్చిన రిజర్వేషన్లపై కూడా ప్రభుత్వం స్పష్టతనివ్వడం లేదని చురకలంటించారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు మోసపోయారని, వారంతా ఇప్పుడు తిరగబడే కాలం వచ్చిందన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడాతామని తెలిపా రు. పార్టీలో చేరిన వారిలో మల్లేశ్‌గౌడ్, ధనుంజయ్‌గౌడ్, పవన్‌గౌడ్, చరణ్‌గౌడ్, నక్క వికాస్‌గౌడ్, కాసా వినయ్‌గౌడ్, పట్లోళ్ల తిరుపతిరెడ్డిలున్నారు.
మైనార్టీలకు బీఆర్‌ఎస్ పెద్దపీట
జిన్నారం (పటాన్‌చెరు): మైనార్టీలకు పెద్దపీట వేస్తూ సంక్షేమ పథకాలను అందజేసిన ఘనత కేసీఆర్‌దేనని మాజీమంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. బొల్లారం డివిజన్ పరిధిలో మాజీ జెడ్పీటీసీ కొలను బాల్‌రెడ్డి ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డితో కలిసి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ అని మైనార్టీలకు మాటలే తప్ప చేసిందేమీ లేదన్నారు. మైనార్టీ విద్యార్థులకు ప్రత్యేకంగా టమ్రేస్ పాఠశాలలు ఏర్పాటుచేసినట్లు గుర్తు చేశారు. అనంతరం మైనార్టీలతో కలిసి ఉపవాస దీక్షలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంబిపూర్‌రాజు, పటాన్‌చెరు నియోజకవర్గ కో ఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, జెడ్పీమాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్, నాయకులు గడిల శ్రీకాంత్‌గౌడ్, వెంకటేశంగౌడ్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


