జహీరాబాద్ టౌన్: బైక్ అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో వాహనం నడుపుతున్న వ్యక్తి మృతి చెందాడు. జహీరాబాద్ రూరల్ ఎస్‌ఐ.కాశీనాథ్ కథనం ప్రకారం... కర్నాటక రాష్ట్రంలోని కరకనెల్లి గ్రామానికి చెందిన ఎస్.చంద్రప్ప(47) బైక్‌పై జహీరాబాద్‌కు వస్తున్నాడు. వేగంతో వస్తున్న బైక్ అదుపుతప్పి మార్గమధ్యలో మండలంలోని మల్‌చెల్మ గ్రామంలో కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టాడు. దీంతో తలకు త్రీవంగా గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య జయమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.


