ఏఐతో మరిన్ని ఉద్యోగాలు | - | Sakshi
Sakshi News home page

ఏఐతో మరిన్ని ఉద్యోగాలు

Mar 14 2026 10:24 AM | Updated on Mar 14 2026 10:24 AM

ఏఐతో మరిన్ని ఉద్యోగాలు

పటాన్‌చెరు: కృత్రిమ మేధస్సు (ఏఐ) విస్తృత వినియోగం వల్ల తొలి దశలో కొన్ని ఉద్యోగాలు పోయినా, మున్ముందు మరిన్ని అందుబాటులోకి వస్తాయని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడ్డారు. 2030 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 8.5 కోట్ల ఉద్యోగాలను ఏఐ స్థానభ్రంశం చేయవచ్చని, అదే సమయంలో 9.7 కోట్ల కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని అంచనా వేశారు. గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం, ఇస్నాపూర్‌ పరిధిలోని రుద్రారంలో సీజీసీ ఆధ్వర్యంలో ‘భవిష్యత్తులో ఇంజనీరింగ్‌ చేయడం, ప్రధాన రంగాల్లో ఆవిష్కరణలు’ అనే అంశంపై శుక్రవారం నిర్వహించిన ఇండస్ట్రీ కాంక్లేవ్‌ ముగిసింది. ఎన్‌ఎక్స్‌ పీ సెమీకండక్టర్స్‌లో ఇండియా ఇన్నోవేషన్‌ ఎకోసిస్టమ్‌ అధిపతి ప్రీత్‌ యాదవ్‌, స్టెల్లాంటిస్‌లో డెలివరీ లీడ్‌ సుమన్‌ గోర్లా ముఖ్య అతిథులుగా హాజరై కీలకోపన్యాసం చేశారు. కార్యక్రమంలో విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

కాంక్లేవ్‌లో అభిప్రాయపడ్డ పరిశ్రమ నిపుణులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement