హుండీ లెక్కింపును పరిశీలిస్తున్న అధికారులు
కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి ఖజానాకు భక్తులు వేసిన కానుకలతో 28రోజుల్లో హుండీ ద్వారా రూ.1,20,29,945 ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి కృష్ణ ప్రసాద్ తెలిపారు. శుక్రవారం స్వామి వారి ఆలయ ముఖ మండపంలో ఆలయంలోని హుండీలనూ దేవాదాయ శాఖ సిద్దిపేట డివిజన్ ఇన్‌స్పెక్టర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది, లలిత సేవాసమితి సభ్యులు లెక్కించారు. ఈ సందర్భంగా నగదు రూ.1,20,29,945, మిశ్రమ బంగారం 89 గ్రాములు, మిశ్రమ వెండి 6కిలోల 100 గ్రాములు, విదేశీ కరెన్సీ నోట్లు 34 వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గంగం నర్సింహారెడ్డి, లింగం, ఎల్లయ్య, మల్లేశం, ఆలయ ఏఈఓలు శ్రీనివాస్, ఆర్.సుదర్శన్, ఆలయ ప్రధానార్చకులు మల్లికార్జున్, స్థానాచార్యులు మల్లయ్య, పర్యవేక్షకులు చంద్రశేఖర్, స్వర్ణకారుడు నర్సింహచారి, లలిత సేవాసమితి సభ్యులు, ఆలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


