యువతి అదృశ్యం
పటాన్‌చెరు టౌన్: యువతి అదృశ్యమైంది. ఈ సంఘటన పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... మెదక్ పాపన్నపేటకు చెందిన వికాస్ ఇస్నాపూర్ పరిధిలో ఉంటూ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తు న్నాడు. ఈ క్రమంలో ఈ నెల 10న వికాస్‌కు వరుసకు చెల్లైలెన సురేఖ మెదక్ నుంచి అతడి ఇంటికి వచ్చింది. పెళ్లి చూపులు ఉన్నాయని డ్రెస్ కొనేందుకు 11న ఉదయం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఆమె కోసం తెలిసిన వారి వద్ద, స్థానికంగా వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో వికాస్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.
వ్యక్తి ఆత్మహత్య
మెదక్ కలెక్టరేట్: వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన పట్టణంలో శుక్రవారం చోటు చేసుకుంది. రెండు వార్డు అవుసులపల్లికి చెందిన దాసరి సత్యనారాయణ(46) శుక్రవారం తన ఇంట్లో ఉరివేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుని భార్య మంజులతోపాటు పెలైన ఇద్దరు కొడుకులు ఉన్నారు.
నోటీసులు ఇవ్వడం సిగ్గుచేటు
గజ్వేల్‌రూరల్: జాగృతి వ్యవస్థాపకురాలు కవితపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా నిర్దోషిగా బయటకు వస్తారని జాగృతి లీగల్ సెల్ నేత కొట్టాల యాదగిరి పేర్కొన్నారు. శుక్రవారం గజ్వేల్‌లో మాట్లాడుతూ లిక్కర్ కేసులో కవితపై ఎలాంటి ఆధారాలు లేవని, సీబీఐ మోపిన అభియోగాలను ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు కొట్టివేస్తూ స్పష్టమైన తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. కానీ కేంద్రంలోని బీజేపీ సీబీఐని అడ్డం పెట్టుకొని హైకోర్టు పేరిట నోటీసులు ఇవ్వడం సిగ్గుచేటన్నారు. జాగృతి నాయకులు పాల్గొన్నారు.


