అవసరమైతే అసెంబ్లీ ముట్టడి | - | Sakshi
Sakshi News home page

అవసరమైతే అసెంబ్లీ ముట్టడి

Mar 14 2026 10:23 AM | Updated on Mar 14 2026 10:23 AM

సంగారెడ్డి ఎడ్యుకేషన్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం కార్మికులకు, స్కీం వర్కర్లకు ఇచ్చిన హామీ ప్రకారం వేతనాలు పెంచాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సాయిలు డిమాండ్‌ చేశారు. శుక్రవారం సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు, స్కీం వర్కర్‌లు కలెక్టరేట్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల ముందు అంగన్‌వాడీ, ఆశా, గ్రామపంచాయతీ, మున్సిపల్‌, ఐకేపీ, వీవోఏ, మిషన్‌ భగీరథ, హాస్పి టల్‌, మెడికల్‌, మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాలు పెంచుతామని, ఈఎస్‌ఐ, పీఎఫ్‌ అమలు చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో అసెంబ్లీ ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి యాదగిరి, వివిధ రంగాల నాయకులు మంగ, మంజుల, నగే ష్‌, యశోద, దశరథ్‌, సదానందం, లక్ష్మణ్‌, జయరాం, రాములు, సుధాకర్‌ , యేసుమని, సత్తయ్య, ప్రశాంతి, అనిత, గౌరమ్మ పాల్గొన్నారు.

సీఐటీయూ జిల్లా కార్యదర్శి సాయిలు

వేతనాలు పెంచాలని డిమాండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement