సంగారెడ్డి జోన్: యువత మాదకద్రవ్యాల రవాణా చేసినా, వినియోగించినా కఠిన శిక్షలు ఉంటాయని అదనపు కలెక్టర్ పాండు హెచ్చరించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అధికారులతో ఎన్‌డీపీఎస్ చట్టంపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డ్రగ్స్ నియంత్రణకు జిల్లాలోని అన్ని కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. మాదకద్రవ్యాల అలవాటుకు ఎవరూ బానిసలు కావొద్దని, ఎక్కడైనా డ్రగ్స్ వినియోగం జరుగుతున్నట్లు ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. అన్ని ప్రాంతాల్లో నష్టాలు, భవిష్యత్‌లో ఎదురయ్యే సమస్యలను ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని చెప్పారు. విద్యాసంస్థలు, బస్టాండ్లు, డ్రగ్స్ వినియోగానికి అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి గట్టి నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో వివిధ యూనివర్సిటీల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ పాండు


