కొండపాక(గజ్వేల్): ఇండస్ట్రియల్ టూర్ ద్వారా టెక్నికల్ స్కిల్స్ పెంపొందుతాయని మండల విద్యాధికారి బచ్చలి సత్తయ్య పేర్కొన్నారు. పీఎంశ్రీ కుకునూరుపల్లి పాఠశాల విద్యార్థులు గురువారం ఇండస్ట్రియల్ కార్యక్రమంలో భాగంగా స్థానిక ఐటీఐ కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇండస్ట్రియల్ టూర్ ద్వారా పరిశ్రమల పని విధానం, యంత్రాల వినియోగం, భద్రతా నియమాలు, భవిష్యత్తు ఉద్యోగ అవకాశాల విషయాలను ప్రత్యక్షంగా గుర్తిస్తారన్నారు. పాఠ్యాంశాల్లో నేర్చుకున్న అంశాలు ప్రాక్టికల్‌గా చూడటం, తయారు చేయడం వంటి పని విధానం జీవనోపాధికి ఉపయోగపడుతాయన్నారు. కళాశాలలో ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వెల్డర్, డీజిల్ మెకానిక్, కంప్యూటర్ ఆపరేటర్, టైలరింగ్ తదితర కోర్సుల వివరాలను ప్రిన్సిపాల్ వెంకటరమణ విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
ఎంఈఓ బచ్చలి సత్తయ్య


