గుర్తుతెలియని మృతదేహం | - | Sakshi
Sakshi News home page

గుర్తుతెలియని మృతదేహం

Mar 13 2026 9:06 AM | Updated on Mar 13 2026 9:06 AM

సంగారెడ్డి క్రైమ్‌: గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన సంగారెడ్డి పట్టణ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ రామునాయుడు వివరాల ప్రకారం... మహబూబ్‌ సాగర్‌ చెరువులో గురువారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తి(30) మృతదేహం బయటకు తేలింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. చెరువులో నుంచి మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి పంపించారు. చాకెట్ల్‌ కలర్‌ డ్రాయర్‌ ధరించి ఉన్నాడు.

చెట్టు పైనుంచి పడి వ్యక్తి మృతి

అల్లాదుర్గం(మెదక్‌): చెట్టు పైనుంచి కిందపడి వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలో గురువారం చోటుచేస్తుంది. ఎస్సై శంకర్‌ వివరాల ప్రకారం... కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం ఇస్లాంపూర్‌ గ్రామానికి చెందిన హరికృష్ణ (27) తన భార్యతో కలిసి అల్లాదుర్గం గ్రామానికి చెందిన అనిల్‌కుమార్‌ రెడ్డి మామిడి తోటలో కూలీ పని చేస్తున్నారు. ఈ క్రమంలో హరికృష్ణ చింత చెట్టు ఎక్కి చింతపండు తెంపుతుండగా కాలుజారి కిందపడ్డాడు. తలకు బలమైన గాయం కావడంతో అతడ్ని పెద్ద శంకరంపేట ప్రైవేట్‌ ఆస్పత్రికి, పరిస్థితి విషమంగా ఉండటంతో సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడి తల్లి సత్యమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement