వర్గల్(గజ్వేల్): భౌగోళిక రాజకీయాల్లో మహిళల పాత్ర కీలకమని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ వి. శ్రీలత అన్నారు. వర్గల్ జ్యోతిబాపూలే గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో శుక్రవారం ప్రిన్సిపాల్ డాక్టర్ భాస్కర్‌రావు అధ్యక్షతన నిర్వహించిన రెండోరోజు జాతీయ సదస్సుకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మహిళల నాయకత్వం, భాగస్వామ్యం ద్వారా సమానత్వం, శాంతి, అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. రాజకీయ నిర్ణయాలు తీసుకోవడంలో, శాంతి ప్రక్రియల్లో, అభివృద్ధి కార్యక్రమాల్లో మహిళలు ముందుండాలన్నారు. దక్షిణాసియాలో మహిళల ప్రాతినిధ్యం పెరగాలని, సవాళ్లను ఎదుర్కొంటూనే పురోగతి సాధించాలని అభిప్రాయపడ్డారు. అధ్యాపకులు సుమ, విద్య, డాక్టర్ పీ.సుజాత, డీ.సుజాత, వీపీ గోవిందరావు, దేదీప్య, జయలక్ష్మి, అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పత్రాలు సమర్పించిన వారందరికి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.
ఓయూ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీలత


