ప్రశాంతంగా ముగిసిన ఫస్ట్‌ ఇంటర్‌ పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా ముగిసిన ఫస్ట్‌ ఇంటర్‌ పరీక్షలు

Mar 13 2026 9:05 AM | Updated on Mar 13 2026 9:05 AM

సంగారెడ్డి ఎడ్యుకేషన్‌: ఇంటర్మీడియెట్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. పరీక్షల్లోభాగంగా చివరిరోజైన గురువారం ప్రథమ సంవత్సరం విద్యార్థులకు కెమిస్ట్రీ, కామర్స్‌ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు 18,181మంది విద్యార్థులు హాజరు కాగా 730 మంది గైర్హాజరయ్యారు. జనరల్‌ విభాగంలో 16,749 మంది విద్యార్థులు హాజరు కాగా 492 మంది గైర్హాజరయ్యారు. అదేవిధంగా ఒకేషనల్‌ విభాగంలో 1,432 మంది హాజరుకాగా 238 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. హాజరు96.14%గా నమోదైనట్లు జిల్లా ఇంటర్మీడియెట్‌ విద్యాధికారి గోవిందరాం తెలిపారు. డీఐఓ రెండు, డీఈసీ మెంబర్లు 11, హెచ్‌పీసీ మెంబర్లు 03, ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌ 11, 08 సిట్టింగ్‌ స్క్వాడ్‌లు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement