రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రెటరీ లోకేశ్ కుమార్
కంది(సంగారెడ్డి): భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో విక్రేతలు, కొనుగోలుదారులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రెటరీ లోకేశ్ కుమార్ సూచించారు. మండల కేంద్రమైన కందిలోని తహసీల్దార్ కార్యాలయాన్ని గురువారం సందర్శించి భూభారతి ద్వారా జరుగుతున్న భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా భూములు విక్రయించే వారు, కొనుగోలుదారులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డిజిటల్ సర్వే చేసే విధానాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ రాజీవ్ గాంధీ హనుమంతు తదితరులు పాల్గొన్నారు.


