ఎంఓయూతో పరిశోధనకు ముందడుగు | - | Sakshi
Sakshi News home page

ఎంఓయూతో పరిశోధనకు ముందడుగు

Mar 12 2026 9:11 AM | Updated on Mar 12 2026 9:11 AM

వర్గల్‌(గజ్వేల్‌): కావేరి యూనివర్సిటీ, తునికి ఏకలవ్య గ్రామీణ వికాస ఫౌండేషన్‌(ఈజీవీఎఫ్‌) మధ్య ఎంఓయూతో పరిశోధన, విద్య, గ్రామీణాభివృద్ధికి ముందడుగు పడుతుందని కావేరి వైస్‌ ఛాన్స్‌లర్‌ డాక్టర్‌ ప్రవీణ్‌రావు అన్నారు. బుధవారం రెండింటి మధ్య (ఎంఓయూ) అంగీకారం కుదిరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా నాణ్యత, గ్రామీణ శక్తివంతీకరణను ఈ భాగస్వామ్యం సమన్వయం చేస్తుందన్నారు. సమ్మిలిత పరిశోధన కార్యక్రమాలు, పరిశ్రమ నైపుణ్యాలు, అకాడమియాలో పరస్పరం ఆలోచనలు పంచుకోవడం, సంయుక్త కార్యక్రమాలు, పాఠ్యాంశాల అభివృద్ధి, నైపుణ్యాల శిక్షణ, సమగ్ర విద్యకు దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ బీ శ్రీనివాసులు, డైరెక్టర్‌ హర్ష పోలసాని, డీన్స్‌ డాక్టర్‌ కొండ శ్రీనివాస్‌, డాక్టర్‌ ప్రతాప్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కావేరి యూనివర్సిటీ వీసీ ప్రవీణ్‌రావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement