ములుగు(గజ్వేల్): రాష్ట్రంలోని ఉద్యాన రైతులకు మెరుగైన సేవలు అందించడానికి ములుగులోని కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో త్వరలోనే అన్ని హంగులతో కూడిన ఉద్యాన టెక్నాలజీ సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ డాక్టర్ రాజిరెడ్డి తెలిపారు. ప్రముఖ వ్యవసాయ రంగ నిపుణులు డాక్టర్.దిలీప్ బుధవారం ఉద్యాన వర్సిటీనీ సందర్శించిన సందర్బంగా ఆయన మాట్లాడారు. రైతులకు అధునాతన శాసీ్త్రయ సలహాలు, సూచనలు అందించేందుకు కేంద్రం దోహదపడుతుందన్నారు. ఉద్యాన పంటల్లో డ్రోన్ టెక్నాలజీని పంటల చీడ పీడల నిఘా, నియంత్రణ ద్వారా దిగుబడి నాణ్యత పెంపొందించేందుకు ఉపయోగపడుతుందన్నారు. అంతే కాకుండా పరిశ్రమల ఏర్పాటుకు ఊతమిచ్చేందుకు హార్టీ ఇన్నోవేషన్ సెంటర్‌ను నెలకొల్పనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో వర్సిటీ అధికారులు పాల్గొన్నారు.
వర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ రాజిరెడ్డి


