కౌడిపల్లి(నర్సాపూర్): ప్రభుత్వ కార్యాలయాలు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అదనపు కలెక్టర్ నగేష్ అధికారులను ఆదేశించారు. బుధవారం ప్రజాపాలన, ప్రగతి ప్రణాళికలో భాగంగా కౌడిపల్లిలోని తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయంతో పాటు పంచాయతీ రాజ్ సబ్ డివిజన్ కార్యాలయాన్ని పరిశీలించారు. ఈసందర్భంగా పరిసరాలను శుభ్రం చేయాలని సూచించారు. పీఆర్ డివిజన్ కార్యాలయంలో గదులను పరిశీలించగా ప్లాస్టిక్ బాటిల్స్ ఇతర వ్యర్థ్యాలు ఉండటంతో శుభ్రం చేయాలన్నారు. గ్రంథాలయం కోసం నిర్మించిన భవనంలో పీఆర్ సబ్ డివిజన్ కార్యాలయం కొనసాగుతుందని, దీంతో ఖాళీ చేయించేందుకు కృషి చేస్తున్నామన్నారు. గ్రామస్తులు, పాఠకులకు లైబ్రరీ అవసరమని అన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్, పీఆర్ లైన్ ఇన్స్‌పెక్టర్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ నగేష్


