ములుగు(గజ్వేల్): రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స పొందుతున్న మహిళ మృతి చెందింది. ఈ ఘటన మండల కేంద్రమైన ములుగులో బుధవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ రఘుపతి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ములుగుకు చెందిన కటికే నర్సయ్య, బుచ్చమ్మ(60) దంపతులు ములుగు రెవెన్యూ కార్యాలయ సమీపంలో గల రాజీవ్‌రహదారిపై మక్క కంకులు అమ్ముకుంటూ జీవనం సాగించేవారు. ఈక్రమంలో ములుగు క్రాస్‌రోడ్డు వద్ద రోడ్డు దాటుతున్న క్రమంలో గజ్వేల్ వైపు నుంచి అతివేగంగా దూసుకువచ్చిన కారు వెనుకాల నుంచి వారు ఇరువురు ప్రయాణిస్తున్న ఎక్స్‌ఎల్ భైక్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో బుచ్చమ్మకు తీవ్ర గాయాలు కాగా వెంటనే లక్ష్మక్కపల్లిలోని ఆర్‌వీఎం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అదేరోజు అర్ధరాత్రి బుచ్చమ్మ మృతి చెందింది. మృతురాలు భర్త నర్సయ్యకు కూడా గాయాలయ్యాయి. మృతురాలు కుమారుడు బాలయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


