జహీరాబాద్ టౌన్: మండలంలోని బూచినెల్లి పరిధిలోని ఓ చెరుకు తోటలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు చిరాగ్‌పల్లి ఎస్‌ఐ రాజేందర్‌రెడ్డి తెలిపారు. వివరాల ప్రకారం.. బూచినెల్లికి చెందిన మాణిక్‌కు చెందిన 65వ జాతీయ రహదారి సమీపంలో ఉన్న పొలంలో చెరకు సాగు చేస్తున్నాడు. అయితే బుధవారం పంటకు నీళ్లు పెట్టడానికి పొలానికి వెళ్లాడు. అయితే చెరకు తోట మధ్యలో ఓ వ్యక్తి మృతదేహం కుళ్లిపోయినట్లు గుర్తించాడు. వెంటనే ఈ విషయాన్ని చిరాగ్‌పల్లి పోలీసులకు సమాచారం అందించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు.
పటాన్‌చెరు టౌన్: గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన సంఘటన పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని శివారులో ఉన్న దుర్గా రెడ్డి వ్యవసాయ పొలం పక్కనే ఉన్న మూన్ సిటీ వెంచర్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం బుధవారం కనిపించింది. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకుని పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతి చెందిన వ్యక్తి వయసు 30 నుంచి 30 ఏళ్లు ఉంటుందని, మృతదేహం కుళ్లిన స్థితిలో ఉందన్నారు. అయితే అతడి కుడి చేతి షోల్డర్‌పై హనుమాన్ టాటూ, ఛాతిపై మామ్, డాడ్ టాటో ఉన్నట్లు గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


