టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలారెడ్డి
సంగారెడ్డి జోన్: మహిళా సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలారెడ్డి తెలిపారు. కలెక్టరేట్‌లో మంగళవారం తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవంలో ఆమె పాల్గొని మాట్లాడారు. మహిళలు తమకు అందుబాటులో ఉండే ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలన్నారు. ఆత్మవిశ్వాసం పెంపొందించుకుని ముందడుగు వేయాలన్నారు. అదనపు కలెక్టర్ మాధురి మాట్లాడుతూ...మహిళలు సహనం, పట్టుదలకు ప్రతిరూపాలన్నారు. ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో ధైర్యంగా ముందుకు సాగుతూ తమ ప్రతిభను చాటుకుంటున్నారని తెలిపారు.


