కొమురవెల్లి(సిద్దిపేట): వేసవిలో తాగు నీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ ఆదేశించారు. మంగళవారం మండలంలోని మర్రిముచ్చాల గ్రామంలో కొనసాగుతున్న ప్రజా పాలన – ప్రణాళిక కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో తాగునీటి వసతి, పరిసరాల పరిశుభ్రతపై ఆరా తీశారు. గ్రామంలో 100 శాతం పన్నులు వసూలు చేయాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. అలాగే 99రోజుల పాటు కొనసాగే ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికను వియవంతం చేయాలని సర్పంచ్ రవికి సూచించారు. వీరజవాన్ చంద్రారెడ్డి విగ్రహం ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని గ్రామస్తులు అదనపు కలెక్టర్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ లక్ష్మప్ప, ఎంపీఓ శ్రీనివాస వర్మ, ఉపసర్పంచ్ రఘుపతి రెడ్డి, నవీన్, వార్డు సభ్యులు, అంగన్‌వాడీ టీచర్లు, ఆశాకార్యకర్తలు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్


