అక్కన్నపేట(హుస్నాబాద్): ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్(టీఏ)లు సక్రమంగా పనిచేయకుంటే చర్యలు తీసుకుంటామని జిల్లా డీఆర్‌డీఓ జయదేవ్ ఆర్య హెచ్చరించారు. మంగళవారం మండలంలోని చౌటపల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీలు చేస్తున్న పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వేసవి కావడంతో ఎండలు ఎక్కువగా ఉన్నాయని, ఉదయం 6గంటలకే పనికి వచ్చి 10గంటలకు పనులు పూర్తి చేసి వెళ్లాలన్నారు. ఎవరి పనులు వారే చేసుకోవాలని సూచించారు. అలాగే పని ప్రదేశంలో మంచినీరు, నీడ తదితర సదుపాయాలు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ బానోతు జయరాం, ఉపాధి హామీ ఏపీఓ ప్రభాకర్, సర్పంచ్ లావణ్య, ఉప సర్పంచ్ రమేశ్, ఫీల్డ్ అసిస్టెంట్ పరందాములు, టీఏలు ఉమేశ్, రైతులు పాల్గొన్నారు.
డీఆర్‌డీఓ జయదేవ్ ఆర్య


