పంట రుణం ఏదీ..? | - | Sakshi
Sakshi News home page

పంట రుణం ఏదీ..?

Mar 10 2026 1:28 PM | Updated on Mar 10 2026 1:28 PM

● నిర్దేశిత లక్ష్యంలో 65 శాతమే మంజూరు ● విమర్శలకు దారితీస్తున్న బ్యాంకర్ల తీరు ● అధిక వడ్డీలు వచ్చే పర్సనల్‌ లోన్లకు జారీకే ప్రాధాన్యత ● రైతులకు ఇచ్చే రుణాల్లో తీవ్ర జాప్యం ● 20 రోజుల్లో ముగియనున్న ఆర్థిక సంవత్సరం ● డీఎల్‌ఆర్‌సీ సమావేశంలో బ్యాంకర్ల తీరుపై మండిపాటు దగ్గరపడిన గడువు పర్సనల్‌ లోన్లకు ప్రాధాన్యత

మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ అంజమ్మ

● నిర్దేశిత లక్ష్యంలో 65 శాతమే మంజూరు ● విమర్శలకు దారితీస్తున్న బ్యాంకర్ల తీరు ● అధిక వడ్డీలు వచ్చే పర్సనల్‌ లోన్లకు జారీకే ప్రాధాన్యత ● రైతులకు ఇచ్చే రుణాల్లో తీవ్ర జాప్యం ● 20 రోజుల్లో ముగియనున్న ఆర్థిక సంవత్సరం ● డీఎల్‌ఆర్‌సీ సమావేశంలో బ్యాంకర్ల తీరుపై మండిపాటు

పరిశుభ్రతలో

కార్మికుల పాత్ర కీలకం

బ్యాంకర్ల తీరుపై

అధికారుల మండిపాటు

బ్యాంకర్ల పనితీరును సమీక్షించే డీసీసీ (జిల్లా సంప్రదింపుల కమిటీ), డీఎల్‌ఆర్‌సీ (జిల్లా స్థాయి సమీక్ష కమిటీ) సమావేశం సోమ వారం లీడ్‌బ్యాంక్‌ మేనేజర్‌ నర్సింగ్‌రావు సమన్వయంతో కలెక్టరేట్‌లో జరిగింది. అధికారులు ఆయా బ్యాంకుల పనితీరును తీవ్రంగా తప్పుబట్టారు. వ్యవసాయ రుణాల మంజూరులో బ్యాంకులు ప్రత్యేక దృష్టి సారించాలని అదనపు కలెక్టర్‌ మాధురి పేర్కొన్నారు. ఆర్బీ ఏజీఎం శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ పథకాలు పీఎంజేడీవై, పీఎంజేజేబీవై, పీఎంఎస్‌బీవై, ఏపీవై వంటి పథకాలపై బ్యాంకులు విస్తృతంగా అవగాహన కల్పించాలని బ్యాంకర్లను ఆదేశించారు. వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పన, కిసాన్‌క్రెడిట్‌ కార్డులు వంటి వాటికి మరింతగా రుణాలు మంజూరు చేయా లని నాబార్డు ఏజీఎం కృష్ణాతేజ పేర్కొన్నారు.

సదాశివపేట(సంగారెడ్డి): పట్టణాన్ని పరిశు భ్రంగా ఉంచడంలో శానిటేషన్‌ కార్మికుల పాత్ర ఎంతో ముఖ్యమని మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ మునిపల్లి అంజమ్మ పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సోమ వారం సమావేశ మందిరంలో పారిశుద్ధ్య మహిళా కార్మికులను సన్మానించి చీరలను బహుమతిగా అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం కోసం పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. పదవీ విరమణ పొందిన చంద్రయ్య, లలితను సన్మానించి వీడ్కోలు పలికారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ శివాజీ, వైస్‌ చైర్‌ పర్సన్‌ రేణుక, కౌన్సిలర్లు శంకర్‌గౌడ్‌, అరుణ్‌కుమార్‌, శ్రీశైలం, వాజీద్‌, సెజ్జీ, అనిత, మమత, నికిత, లక్ష్మిప్రియా, రోజా, ప్రియాంక, లావణ్య, గౌరిదేవి పాల్గొన్నారు.

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: పంట రుణాల మంజూరులో బ్యాంకులు తమ తీరు మార్చుకోవడం లేదు. రుణాలు ఎగవేసే బడాబాబులకు రూ. కోట్ల లో రుణాలు కట్టబెడుతారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్యాంకర్లు.. రైతులకు ఇచ్చే పంట రుణాల మంజూరులో మాత్రం తీవ్ర జాప్యం చేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆయా బ్యాంకులకు నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోకపోవడమే ఇందు కు నిదర్శనం. 2025–26లో ఖరీఫ్‌, రబీ సీజన్లకు కలిపి మొత్తం రూ.3,404.51 కోట్లు పంట రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు వార్షిక రుణ ప్రణాళికలో ఈ లక్ష్యాన్ని నిర్దేశించారు. కానీ నిర్దేశిత లక్ష్యంలో కేవలం రూ.2,244 కోట్లు మాత్రమే పంట రుణాలను ఇవ్వగలిగాయి. అంటే 2025 డిసెంబర్‌ నాటికి నిర్దేశిత లక్ష్యంలో 65 శాతం మాత్రమే రుణాలు ఇచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్‌ సెక్టార్లలో కలిపి జిల్లాలో మొత్తం 28 బ్యాంకులకు సంబందించి 258 బ్రాంచ్‌ లు ఉన్నాయి. ఈ పంట రుణాల మంజూరు విషయంలో ప్రైవేట్‌ బ్యాంకుల తీరు మరీ దారుణంగా ఉంది. సుమారు 12కు పైగా ప్రైవేటు బ్యాంకులు నిర్దేశిత లక్ష్యంలో 50 శాతం కూడా పంటరుణాలు ఇవ్వలేదంటే ఈ బ్యాంకుల తీరు అర్థం చేసుకోవచ్చు.

ఇప్పటికే ఖరీఫ్‌ పంట కాలం పూర్తయింది. యాసంగి పంటలు కూడా మరో నెలలో చేతికందుతాయి. కానీ ఈ పంట రుణాల మంజూరులో బ్యాంకర్లు ఇంకా మీనమేషాలు లెక్కిస్తుండటం తీవ్ర విమర్శ లకు దారితీస్తోంది. సకాలంలో పంట రుణాలు అందకపోవడంతో అన్నదాతలకు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించక తప్పడం లేదు. దీన్ని ఆసరాగా చేసుకుని వడ్డీ వ్యాపారులు అధిక వడ్డీలు వసూలు చేస్తుండటంతో అన్నదాతలు ప్రైవేటు రుణాల ఊబిలో కూరుకుపోతున్నారు. మరో 20 రోజుల్లో 31 మార్చితో ఈ ఆర్థిక సంవత్సరం కూడా ముగుస్తుంది. ఈ 20 రోజుల్లో ఎంత మేరకు రుణాలిస్తాయనేది ప్రశ్నార్థకంగా మారింది.

పంట రుణాల కంటే అధిక వడ్డీ వచ్చే పర్సనల్‌లోన్లకు బ్యాంకులు ప్రాధాన్యత ఇచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ పర్సనల్‌ లోన్ల విషయంలో నిర్దేశిత లక్ష్యంలో ఏకంగా 164 శాతం లోన్లు మంజూరు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ పర్సనల్‌ లోన్లు రూ.1,376 కోట్లు ఇవ్వాలని ఆయా బ్యాంకులకు లక్ష్యంగా నిర్దేశించారు. బ్యాంకులకు అధిక వడ్డీ వస్తుందనే కారణంగా ఈ రుణాలు ఏకంగా రూ.2,262 కోట్లు ఇచ్చారు. అలాగే హౌసింగ్‌ లోన్ల విషయంలోనూ బ్యాంకులు నిర్దేశిత లక్ష్యం కంటే ఎక్కువ రుణాలు ఇచ్చాయి. ఈ ఏడాది రూ.148 కోట్లు హౌసింగ్‌ లోన్లు ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటికే రూ.256 కోట్లు ఇచ్చేశారు. అంటే నిర్దశిత లక్ష్యం కంటే 73 శాతం ఎక్కువ రుణాలు ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement