విధుల పట్ల నిర్లక్ష్యం తగదు | - | Sakshi
Sakshi News home page

విధుల పట్ల నిర్లక్ష్యం తగదు

Mar 10 2026 1:28 PM | Updated on Mar 10 2026 1:28 PM

జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ వసంతరావు

హత్నూర (సంగారెడ్డి): విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ వసంతరావు అన్నారు. సోమవారం హత్నూర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజా పాలనలో భాగంగా ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు అంకితభావంతో పనిచేయాలని సిబ్బందికి సూచించారు. సమయపాలన పాటించాలన్నా రు. ప్రతిరోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఎంతమంది రోగులు వస్తున్నారు. ఎలాంటి రోగులు వస్తున్నారు .అన్న విషయాన్ని ఎప్పటికప్పుడు గమనించాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్‌ రజిని సిబ్బంది పాల్గొన్నారు.

యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో నిరసన

నారాయణఖేడ్‌: కేజీబీవీ, యూఆర్‌ఎస్‌, సమగ్ర శిక్షా ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్య వైఖరిని ప్రభుత్వం విడనాడాలని, వారి సమస్యలు పరిష్కరించాలని యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి హరిసింగ్‌, మండల శాఖ అధ్యక్షుడు ఏసుదాస్‌ సూచించారు. సోమవారం నారాయణఖేడ్‌లోని ఎమ్మార్సీ, కేజీబీవీ పాఠశాల వద్ద భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈనెల 16న డివిజన్‌, జిల్లా కేంద్రంలో, 20న చలో అసెంబ్లీ నిర్వహిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంఘం ఖేడ్‌ మండల శాఖ ప్రధాన కార్యదర్శి శ్రీరామ్‌నాయక్‌, నాయకులు హరిసింగ్‌ పాల్గొన్నారు.

13న జాబ్‌ మేళా

సంగారెడ్డి టౌన్‌: తెలంగాణ రాష్ట్ర డిజిటల్‌ ఎంప్లాయిమెంట్‌ ఎక్స్చేంద్‌ ఆధ్వర్యంలో ప్రముఖ సంస్థ మహీంద్రా – మహీంద్రా ట్రాక్టర్‌ తయారీ యూనిట్‌ జహీరాబాద్‌లో ఉద్యోగాల భర్తీ కోసం ప్రత్యేక జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా పరిశ్రమల శాఖ జనరల్‌ మేనేజర్‌ తుల్జానాయక్‌ తెలిపారు. ఈ నెల 13న సంగారెడ్డి మండలంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఈ మేళా ఉంటుందని చెప్పారు. 800కు పైగా ఖాళీలను ట్రెయినీ, అప్రెంటిస్‌ పోస్టుల ద్వారా భర్తీ చేయనున్నారని తెలిపారు. ఇంటర్మీడియెట్‌, ఐటీఐ, డిప్లొమా అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అర్హత కలిగిన యువత తమ విద్యా ధ్రువపత్రాలు, ఆధార్‌ కార్డు, బయోడేటా, ఇతర అవసరమైన ధ్రువ పత్రాలతో జాబ్‌ మేళాకు హాజరై ఉద్యోగ అవకాశాన్ని పొందాలని ఆయన కోరారు.

కేసీఆర్‌ను కలిసిన సింధు

రామచంద్రాపురం(పటాన్‌చెరు): ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సోమవారం మాజీ కార్పొరేటర్‌ వి.సింధురెడ్డి దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. తమ అధినేత కేసీఆర్‌ ఆశీర్వాదం తీసుకున్నట్లు ఈ సందర్భంగా వారు చెప్పారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నియెజకవర్గ కోఆర్డినేటర్‌ వి.ఆదర్శ్‌ రెడ్డి పాల్గొన్నారు.

జాతరలు సంస్కృతికి ప్రతీకలు

జిన్నారం(పటాన్‌చెరు): పట్టణ పరిధిలోని శివానగర్‌ లో నిర్వహించిన భ్రమరాంబ మల్లికార్జున స్వామి కల్యాణం, జాతర కార్యక్రమానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి ముఖ్య అతి థిగా హాజరయ్యారు. ఈసందర్భంగా మల్లన్న స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతరలు మన సంస్కృతికి ప్రతీకలని అన్నా రు. కార్యక్రమంలో జిన్నారం మున్సిపల్‌ చైర్మన్‌ జనార్దన్‌, జెడ్పీ మాజీ వైస్‌ చైర్మన్‌ ప్రభాకర్‌, కౌన్సిలర్లు ప్రభాకర్‌ రెడ్డి, నాగరాజు, కృష్ణ, నాయకులు పూజారి రాజు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement