జహీరాబాద్ టౌన్: జహీరాబాద్ పట్టణంలోని తాగు నీటి సమస్య నివారణ కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని మున్సిపల్ చైర్మన్ యూనుస్, కౌన్సిలర్లు కోరారు. ఈ మేరకు సోమవారం అదనపు కలెక్టర్ పాండును కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ.. పట్టణంలోని పలు వార్డుల్లో నీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. దశాబ్దాల క్రితం వేసిన పైపులైన్ చెడిపోవడంతో నీటి సరఫరాకు అటంకం కల్గుతోందని చెప్పారు. శివారు గ్రామాల్లో కూడా తాగునీటి సమస్య ఉందని, దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు.పైపులైన్ల లీకేజీలు అరికట్టాలని, అవసరం ఉన్న చోట కొత్త పైపులైన్‌లు వేసి వేసవిలో నీటి సమస్య తలెత్తకుండా నిధులు విడుదల చేయాలని కోరారు.


