అదనపు కలెక్టర్ పాండు
సంగారెడ్డి జోన్: ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి వారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని అదనపు కలెక్టర్ పాండు ఆదేశించారు. ప్రజలు అందించే అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజావాణి నిర్వహించి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ మేరకు 41 అర్జీలు వచ్చినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. కార్యక్రమానికి ఉన్నతాధికారులు హాజరు కాకుండా తమ సహాయకులను పంపించడంపై అదనపు కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు తప్పనిసరిగా సమయపాలన పాటిస్తూ హాజరుకావాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాధురి, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి, జిల్లా పరిషత్ సీఈఓ జానకిరెడ్డి పాల్గొన్నారు.


