ఎమ్మెల్యే మాణిక్‌రావు
జహీరాబాద్ టౌన్: హెచ్‌పీవీ వ్యాక్సిన్ వేయించుకుంటే ఆడపిల్లలకు జీవితాంతం రక్షణగా ఉంటుందని ఎమ్మెల్యే మాణిక్‌రావు అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో 14 ఏళ్ల బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యం పెంచుకోగలిగతే జీవన ప్రమాణాలు పెరుగుతాయన్నారు. ఆరోగ్యం, అందం, ఆదాయం కూడా ఇస్తుందన్నారు. హెచ్‌పీవీ వ్యాక్సిన్ చాలా సురక్షితమని, గర్భాశయ క్యాన్సర్ రాకుండా కాపాడుతుందన్నారు. బాలికలందురూ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్‌ఎంఓ డాక్టర్ మానస, డీఎస్‌ఓ డాక్టర్.మనోహర్‌రెడ్డి, సీహెచ్‌ఓ.రవికుమార్, సిబ్బంది, బీఆర్‌ఎస్ నాయకులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
ఆర్టిజన్ల సమస్యలు
పరిష్కరించాలి
జహీరాబాద్ టౌన్: విద్యుత్ శాఖలోని ఆర్టిజన్ల సమస్యలను పరిష్కరించాలని టీవీఏఈ జేఏసీ జహీరాబాద్ డివిజన్ డిమాండ్ చేసింది. ఆర్టిజన్ల సమస్యల పరిష్కారానికి ఈనెల 10న హైదరాబాద్‌లో తలపెట్టిన మహాధర్నాను విజయవంతం చేయాలని ఆ సంఘం కన్వీనర్ సంతోశ్ ఆదివారం ప్రకటనలో కోరారు.
విద్యాకమిషన్ రిపోర్టు
లోపభూయిష్టం
నారాయణఖేడ్: విద్యా కమిషన్ రిపోర్టు లోపభూయిష్టమని, దాని అమలును వెంటనే మానుకోవాలని తపస్ జిల్లా అధ్యక్షుడు దత్తాత్రి డిమాండ్ చేశారు. ఖేడ్‌లో ఆదివారం జరిగిన సంఘం డివిజన్ స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కమిషన్‌లో పేర్కొన్న అంశాలన్నీ విద్యావ్యవస్థను, ఉపాధ్యాయుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయన్నారు. రిపోర్టు కమిషన్ చైర్మన్ వ్యక్తిగత భావాజాలాన్ని ప్రతిబింబించేలా ఉంది తప్ప రాష్ట్ర విద్యావ్యవస్థను అభివృద్ధి పరిచేలా లేదన్నారు. ప్రతీనెల విడుదల చేస్తున్న రూ.700 కోట్ల మొత్తంలో సీపీఎస్ ఉద్యోగుల బకాయిలను సైతం విడుదల చేయాలన్నారు. సంఘం జిల్లా, రాష్ట్ర, డివిజన్ బాధ్యులు చంద్రశేఖర్, తుక్కప్ప, వినయ్ కుమార్, లక్ష్మణ్, రాజయ్య, మల్లికార్జున్, రాజశేఖర్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
జీహెచ్‌ఎంసీ మహిళా
కార్మికులకు సన్మానం
కేక్ కట్ చేసి, చీరల పంపిణీ
పటాన్‌చెరు టౌన్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని జీహెచ్‌ఎంసీ మహిళా కార్మికులను ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి సతీమణి తరణం రెడ్డి ఘనంగా సన్మానించారు. అనంతరం కేక్ కట్ చేసి చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...ప్రజల ఆరోగ్యం, పరిశుభ్రత కాపాడటంలో జీహెచ్‌ఎంసీ మహిళా కార్మికుల సేవలు అమూల్యమని, వారి కృషి వెల కట్టలేనిదన్నారు. కార్యక్రమంలో లక్ష్మి, జ్యోతి, భవానీ, ప్రియ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా ఆలయ వార్షికోత్సవం
సదాశివపేట(సంగారెడ్డి): పట్టణంలోని కృష్ణనగర్ కాలనీలో గల శ్రీ పంచముఖి వీరహనుమాన్ మందిరం ద్వితీయ వార్షికోత్సవ వేడుకలను అదివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు నాగుల మాణేమ్మ, పులిమామిడి మమత, అనిత, బీఆర్‌ఎస్ నాయకులు సాయి, విజయ్, అలయ కమిటీ అధ్యక్షుడు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


