న్యూస్‌రీల్
సోమవారం శ్రీ 9 శ్రీ మార్చి శ్రీ 2026
రామచంద్రపూరం(పటాన్‌చెరు): తెల్లాపూర్ డివిజన్ పరిధిలో ఆదివారం రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలు నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 286 మంది క్రీడాకారులు తమ సత్తా చాటారు. 80 మంది జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు రాష్ట్ర ఆర్చరీ అధ్యక్షుడు రాజు తెలిపారు. ప్రాచీన క్రీడలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కోరారు. కార్యక్రమంలో తెల్లాపూర్ ఏకలవ్య స్పోర్ట్స్ హబ్ నిర్వాహకులు ఆంజనేయులుగౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశం, కోచ్‌లు గంగరాజు, శ్రీనివాస్ పాల్గొన్నారు.


