ఉపసంహరణకు ససేమిరా..! | - | Sakshi
Sakshi News home page

ఉపసంహరణకు ససేమిరా..!

Feb 3 2026 9:45 AM | Updated on Feb 3 2026 9:45 AM

ఉపసంహ

ఉపసంహరణకు ససేమిరా..!

మూగ జీవాలకు ఆవాసం సింగూర్‌ ప్రాజెక్టు దిగువ భాగాన ఉన్న గ్రామాలు మూగ జీవాలకు ఆవాసంగా మారాయి. వివరాలు 8లో u మంగళవారం శ్రీ 3 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026 అధికారులకు కలెక్టర్‌ ఆదేశం

న్యూస్‌రీల్‌

రెబల్స్‌గా మారనుండటంతో పరేషాన్‌లో ప్రధాన పార్టీలు బుజ్జగిస్తున్న నేతలు అన్ని మున్సిపాలిటీల్లోనూ ఇదే తంతు నామినేషన్ల విత్‌డ్రాకు నేటితో ముగియనున్న గడువు

సంగారెడ్డి మున్సిపాలిటీలో ఐదు వార్డులకు కాంగ్రెస్‌ టిక్కెట్లు ఆశించిన వారు ఇద్దరు, ముగ్గురు నామినేషన్లు వేశారు. బీఆర్‌ఎస్‌ టిక్కెట్టు ఆశించిన ఒకరికంటే ఎక్కువ మంది నామినేషన్లు వేసిన వార్డులు ఆరు వరకు ఉంటాయని ఆయా పార్టీల వర్గాలు పేర్కొంటున్నాయి.

అందోల్‌–జోగిపేట మున్సిపాలిటీలో ఓ అభ్యర్థి ఏకంగా కాంగ్రెస్‌ అభ్యర్థిగా, బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా రెండు సెట్లు నామినేషన్లు దాఖలు చేయడం గమనార్హం. మరోవైపు కాంగ్రెస్‌ టిక్కెట్లను ఆశించిన వారు ఇద్దరేసి నామినేషన్లు వేసిన వార్డులు ఐదు వరకు ఉంటాయి. అలాగే బీఆర్‌ఎస్‌ టిక్కెట్లు ఆశించి ఒకే వార్డు నుంచి ఇద్దరు ముగ్గురు నామినేషన్‌ పత్రాలు దాఖలు చేసిన వార్డులు నాలుగు వరకు ఉన్నాయి.

పటాన్‌చెరు నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇస్నాపూర్‌, ఇంద్రేశం, గడ్డపోతారం, జిన్నారం, గుమ్మడిదల మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ ఆశావహులు ఒకరికంటే ఎక్కువ మంది నామినేషన్‌ వేసిన అభ్యర్థులు పది వరకు ఉంటాయి. అలాగే బీఆర్‌ఎస్‌ నుంచి కూడా ఇంతే ఉంటాయి.

జహీరాబాద్‌, కోహీర్‌ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌లో ఈ పరిస్థితి మరీ ఎక్కువగా ఉంది. కొన్ని వార్డులకు ఇద్దరు, ముగ్గురు నామినేషన్లు వేసిన వార్డులు సుమారు 15 వరకు ఉంటాయని అంచనా.

మూగ జీవాలకు ఆవాసం సింగూర్‌ ప్రాజెక్టు దిగువ భాగాన ఉన్న గ్రామాలు మూగ జీవాలకు ఆవాసంగా మారాయి. వివరాలు 8లో u
ప్లాన్‌– బీని అమలు చేస్తున్న ఆశావహులు స్వతంత్రంగానే పోటీకి సై అంటున్న వైనం

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రధాన పార్టీలే కాదు., ఆయా పార్టీల ఆశావహులు కూడా పథకం ప్రకారం ముందుకెళుతున్నారు. ఎలాగైనా పోటీలో ఉండాలని నిర్ణయించుకున్న ఆశావహులు ఇప్పటికే నామినేషన్లు వేశారు. పార్టీ టిక్కెట్‌ వచ్చిన వారు ఉత్సాహంతో ఎన్నికల ప్రచారంలోకి దిగారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ టిక్కెట్‌ దక్కని వారు మాత్రం తమ ప్లాన్‌–బీ ని అమలు చేస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో కొనసాగాలని నిర్ణయించుకున్నారు. దీంతో వీరు ఈ రెండు పార్టీల అభ్యర్థులకు రెబల్స్‌గా తయారవుతుండటంతో ఆ పార్టీల నేతలు తలలు పట్టుకుంటున్నాయి. రెబల్స్‌ బరిలో ఉంటే తమ పార్టీ ఓట్లు చీలిపోయి.. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థికి ప్రయోజనం చేకూరుతుందని ఆందోళన చెందుతున్నారు. వీరు బరిలో ఉంటే గెలుపు ఓటములను ప్రభావితం చేసే అవకాశాలుండటంతో ఎలాగైనా వీరిని నామినేషన్లను విత్‌డ్రా చేసుకోవాలని అన్ని రకాలుగా ఒత్తిడి తెస్తున్నారు.

సర్ది చెబుతున్న ఎమ్మెల్యేలు,

నియోజకవర్గం ఇన్‌చార్జిలు

స్వయంగా ఎమ్మెల్యేలు, నియోజకవర్గం ఇన్‌చార్జిలు రంగంలోకి దిగారు. విత్‌డ్రా చేసుకుంటే కోఆప్షన్‌ పదవిని ఇస్తామని కొందరిని హామీ ఇస్తున్నారు. మున్సిపల్‌ పనులు ఇస్తామని కూడా భరోసా ఇస్తున్నారు. పార్టీ పదవుల్లో ప్రాధాన్యత ఇస్తామని సర్దిచెబుతున్నారు. నామినేటెడ్‌ పదవుల్లో సైతం అవకాశం కల్పిస్తామని కాంగ్రెస్‌ పార్టీ రెబల్స్‌కు హామీ ఇస్తోంది. అయినప్పటికీ వినని పక్షంలో సస్పెన్షన్‌ వేటు కూడా వేయాల్సి ఉంటుందని హెచ్చరికలు సైతం జారీ చేస్తున్నారు. ఈ బుజ్జగింపులకు లొంగి.. ఒత్తిళ్లకు తలొగ్గి ఎంత మంది ఆశావహులు తమ నామినేషన్లు విత్‌డ్రా చేసుకుంటారనేది మంగళవారం మధ్యాహ్నంతో తేలనుంది. మధ్యాహ్నం మూడు గంటల తర్వాత బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను అధికారులు ప్రకటించనున్నారు.

పెండింగ్‌ సమస్యలను పరిష్కరించండి

ఉపసంహరణకు ససేమిరా..!1
1/1

ఉపసంహరణకు ససేమిరా..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement