కేసీఆర్‌తో గూడెం మధు భేటీ | - | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌తో గూడెం మధు భేటీ

Feb 3 2026 9:45 AM | Updated on Feb 3 2026 9:45 AM

కేసీఆ

కేసీఆర్‌తో గూడెం మధు భేటీ

పటాన్‌చెరు టౌన్‌: ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆదివారం రాత్రి సిట్‌ విచారణ అనంతరం హైదరాబాద్‌ నందినగర్‌లోని కేసీఆర్‌ నివాసంలో కలిశారు. మున్సిపల్‌ ఎన్నికల్లో పటాన్‌చెరు పరిధిలోని ఐదు మున్సిపాలిటీల్లో బీఆర్‌ఎస్‌ జెండా ఎగరవేయాలని కేసీఆర్‌ సూచించారని తెలిపారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరించారని చెప్పారు.

పీఓ, ఏపీఓల పాత్ర కీలకం

జిల్లా శిక్షణ నోడల్‌ అధికారి రామాచారి

పటాన్‌చెరు టౌన్‌: మున్సిపల్‌ ఎన్నికల్లో పీఓ, ఏపీఓల పాత్ర కీలకమని జిల్లా శిక్షణ నోడల్‌ అధికారి రామాచారి అన్నారు. సోమవారం పటాన్‌చెరు నియోజకవర్గానికి సంబంధించిన శిక్షణ కార్యక్రమం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. నోడల్‌ అధికారి రామాచారి, జిల్లా శిక్షణ సమన్వయకర్త కళింగ కృష్ణకుమార్‌, శ్రీకాంత్‌గౌడ్‌, చంద్రారెడ్డి, అమరేందర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు 292 మంది పీఓ, ఏపీఓలకు శిక్షణ ఇచ్చారు. అనంతరం ఎన్నికల విధులపై అవగాహన కల్పించారు.

ఉద్యాన పథకాలపై అవగాహన

జిన్నారం(పటాన్‌చెరు): రాష్ట్రీయ కృషి విజ్ఞాన్‌ యోజన వర్షాధారిత పంటల అభివృద్ధి పథకంలో భాగంగా గుమ్మడిదల మండలం నల్లవల్లిలో సోమవారం ఉద్యానశాఖ అధికారులు రైతులకు సమగ్ర అవగాహన కల్పించారు. జిల్లా ఉద్యాన అధికారులు సోమేశ్వరరావు, అనూషరెడ్డి మాట్లాడుతూ.. పథకానికి అర్హులైన రైతులకు వర్మీ బ్యాగులను సరఫరా చేస్తామని తెలిపారు. కూరగాయలు సాగు చేసే రైతులను ప్రోత్సహించే ఉద్దేశంతో ఉద్యానశాఖ నుంచి వివిధ పథకాలు అమలవుతున్నాయన్నారు. రైతులు సద్వినియోగం చేసుకొని మంచి దిగుబడులు సాధించాలని సూచించారు. కాగా రైతులు కూరగాయలు పండించడంలో ఆసక్తి కనబరుస్తున్నారని, ఉద్యానశాఖ నుంచి ప్రోత్సాహకాలు అందించాలని సర్పంచ్‌ రాణి అధికారులను కోరారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ పోచయ్య, వార్డు సభ్యులు, మాజీ ఎంపీటీసీలు, కృష్ణాగౌడ్‌, భిక్షపతి, రైతులు పాల్గొన్నారు.

రోడ్డు విస్తరణ పనుల్లో

సందేహాలు వద్దు

ఆర్‌అండ్‌బీ ఏఈ శశాంక్‌

వట్‌పల్లి(అందోల్‌): రోడ్డు విస్తరణ పనుల్లో ఎటువంటి సందేహాలు వద్దని, నిష్పక్షపాతంగా నిబంధనల మేరకు పనులు చేపడుతున్నట్లు ఆర్‌అండ్‌బీ ఏఈ శశాంక్‌ అన్నారు. మండల కేంద్రంలో చేపడుతున్న రోడ్డు విస్తరణ పనుల్లో కొంతమందికి మేలు జరిగేలా ఒకవైపు ఎక్కువగా మరోవైపు తక్కువ దూరంలో పనుల చేపడుతున్నట్లు ఆరోపిస్తూ స్థానికులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో ఆయన అక్కడికి చేరుకొని పనుల నిర్వహణపై స్థానికుల సమక్షంలో కొలతలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనుల నిర్వహణలో ఎటువంటి పక్షపాతం లేదని ఆర్‌అండ్‌బీ రోడ్డు విస్తరించి ఉన్న పరిధిలోనే పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అనవసరంగా పనులను అడ్డుకోవడం సరికాదన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐ లవకుమార్‌, సర్పంచ్‌ రవీందర్‌, యువజన కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు వెంకట్‌పాటిల్‌, శ్రీకాంత్‌రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్‌ దిగంబర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

కేసీఆర్‌తో గూడెం మధు భేటీ1
1/1

కేసీఆర్‌తో గూడెం మధు భేటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement