‘ఉపాధి’ పథకాన్ని కొనసాగించాలి | - | Sakshi
Sakshi News home page

‘ఉపాధి’ పథకాన్ని కొనసాగించాలి

Feb 3 2026 9:45 AM | Updated on Feb 3 2026 9:45 AM

‘ఉపాధి’ పథకాన్ని కొనసాగించాలి

‘ఉపాధి’ పథకాన్ని కొనసాగించాలి

వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షుడు నర్సింలు

వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షుడు నర్సింలు

సంగారెడ్డి ఎడ్యుకేషన్‌: కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన వీబీజీ రామ్‌ జీ చట్టాన్ని రద్దు చేసి పాత పద్ధతిలోనూ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నర్సింలు డిమాండ్‌ చేశారు. ఫిబ్రవరి 2న రాష్ట్రంలో మహాత్మా గాంఽధీ ఉపాధి హామీ పథకం ప్రారంభమైన నేపథ్యంలో సోమవారం పట్టణంలోని జెడ్పీ కార్యాలయ ఆవరణలో మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఉపాధి పథకాన్ని పాత పద్ధతిలోనే కొనసాగించాలని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 19ఏళ్లుగా ఉపాధి హామీ పథకంలో పనిచేస్తూ పేదలు జీవనం కొనసాగిస్తున్నారన్నారు. వీబీజీ రాంజీ 2025 చట్టంతో కూలీలకు ఇబ్బందులు కలిగే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 12న ఉపాధి హామీ రక్షణ, పాత 29 కార్మిక చట్టాల అమలు, 4 లేబర్‌ కోడ్లు, వీబీజీ రాంజీ చట్టం రద్దు చేయాలని దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా కూలీలు పాల్గొని కేంద్ర ప్రభుత్వం మెడ లు వంచాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు రమేష్‌, వ్యవసా య కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు శేఖర్‌, కుమార్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు మహేష్‌, సతీష్‌, లక్ష్మణ్‌, అర్జున్‌, దాసు, కేవీపీఎస్‌ నాయ కులు మహేష్‌, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement