అరకొర భోజనాలు
ఖాళీ ప్లేట్లతో ఎన్నికల సిబ్బంది నిరసన
నారాయణఖేడ్: ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు వచ్చిన సిబ్బందికి భోజనాలు అందక ఆందోళనకు దిగారు. బుధవారం ఎన్నికల నేపథ్యంలో 1,600 మంది సిబ్బందితో పాటు పోలీస్‌అధికారులు మంగళవారం విధులకు వచ్చారు. వారికి భోజనాలు సరిపడా తయారు చేయకపోవడంతో ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా గిరిజన సంక్షేమాధికారి జగదీశ్ ఎదుట ఖాళీ ప్లేట్లతో నిరసన తెలిపారు. మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్, మేనేజర్ వెంకటశివయ్య, తహసీల్దార్ హసీనాబేగం, ఎంపీడీఓ శ్రీనివాస్ జోక్యం చేసుకొని పట్టణంలోని వివిధ హోటళ్ల నుంచే కాకుండా సమీపంలోని జ్యోతిబాఫూలే గురుకులం నుంచి వంటలు తెప్పించి వడ్డించారు. గంట పాటు భోజనాల కోసం నిరీక్షించారు.


