మూడు బైక్‌లు ఢీ..
ప్రమాదంలో ఒకరు మృతి
పటాన్‌చెరు టౌన్: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఈ సంఘటన పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం... ఇంద్రేశం మున్సిపాలిటీ బచ్చుగూడెంకు చెందిన అర్జున్ (55) స్థానిక మున్సిపాలిటీ పరిధి బచ్చుగూడెం గ్రామంలో అవుట్ సోర్సింగ్ విభాగంలో పనిచేస్తున్నాడు. మంగళవారం ఉదయం తన వద్ద పని చేసే గండయ్యతో కలిసి ఇద్దరూ వేర్వేరు ద్విచక్ర వాహనాలపై పోచారం నుంచి ఇంద్రేశం వైపు వస్తున్నారు. ఓఆర్‌ఆర్ రహదారి పక్కన సర్వీసు రోడ్డుపై పోచారానికి చెందిన అజీమ్ ద్విచక్ర వాహనంపై వెనుక నుంచి వేగంగా వస్తూ ముందున్న అర్జున్ బైక్‌ను ఢీకొట్టాడు. అనంతరం గండయ్య వెళ్తున్న బైక్‌ను కూడా ఢీకొట్టాడు. ఈ ఘటనలో అర్జున్ కింద పడి తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గండయ్యకు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మనోహరాబాద్‌లో ఒకరు...
మనోహరాబాద్(తూప్రాన్): రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన సంఘటన మనోహరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ సుభాశ్‌గౌడ్ కథనం ప్రకారం.. షాపూర్‌నగర్‌కు చెందిన చవాకుల రాజ్‌కుమార్(48), మండలంలోని కొండాపూర్ శివారులోని ఎస్‌బి ఫాబ్రికేటర్స్‌లో పని చేస్తున్నాడు. మంగళవారం ఎప్పటిలాగే తన బైక్‌పై డ్యూటీకి వెళ్తున్నా క్రమంలో కూచారం వద్ద యూటర్న్ తీసుకుంటున్న సమయంలో డీసీఎం ఢీకొనడంతో తలకు తీవ్ర గాయాలై అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య మంగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


