రేపు జూడో క్రీడాకారుల ఎంపిక
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ఉమ్మడి మెదక్ జిల్లా అండర్–14 జూడో క్రీడాకారుల ఎంపిక గురువారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిర్వహించనున్నట్లు ఎస్‌జీఎఫ్ ఆర్గనైజింగ్ కార్యాదర్శి సౌందర్య మంగళవారం తెలిపారు. గురువారం సిద్దిపేట పట్టణంలోని గ్రీన్‌ఫీల్డ్ స్టేడియానికి ఎదురుగా ఉన్న దర్గాలో ఉదయం 10గంటల నుంచి క్రీడాకారుల ఎంపిక జరుగుతుందన్నారు. విద్యార్థులు నిర్ణీత సమయానికి ముందుగానే హాజరుకావాలని సూచించారు. పూర్తి వివరాలకు జూడో కోచ్‌లు భరత్ రెడ్డి (9246666472), చామంతుల భరత్ ( 95054 50223)లను సంప్రదించాలన్నారు.
గజ్వేల్‌రూరల్: అనారోగ్యంతో బాధపడుతూ విగతజీవిగా పడిఉన్న ఓ వానరానికి గజ్వేల్‌కు చెందిన బీజేపీ నాయకులు అంత్యక్రియలు నిర్వహించారు. పట్టణంలోని 12వ వార్డు పరిధిలో మంగళవారం ఓ వానరం విగతజీవిగా పడిఉన్నట్లు కాలనీవాసులు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న బీజేపీ నేత నాయిని సందీప్ వానరాన్ని తీసుకొని మున్సిపరిధిలోని సంగాపూర్ సమీపంలోగల కల్పకవనం(అర్బన్ పార్క్)లో అంత్యక్రియలు నిర్వహించారు. కార్యక్రమంలో అవినాష్‌చారి, స్వామియాదవ్ తదితరులు పాల్గొన్నారు.
చేర్యాల(సిద్దిపేట): సాధారణంగా పిల్లికి కోతికి వైరం ఉంటుంది. కానీ సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ఆకునూరులో ఐదు రోజులుగా ఓ కోతి.. పిల్లిపిల్లను ఎత్తుకొని తిరుగుతూ ప్రేమను పంచుతోంది. పిల్లి పిల్లను తన పిల్లలా కోతి చంకన వేసుకొని తిరుగుతుంటే గ్రామస్తులంతా తల్లి ప్రేమ అంటే ఇదేనేమో అనుకుంటున్నారు.
శివ్వంపేట(నర్సాపూర్): చికిత్స పొందుతూ మహిళ మృతి చెందిన సంఘటన మండల కేంద్రం శివ్వంపేటలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ మధుకర్‌రెడ్డి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గొమారం జానకి(40) అనారోగ్యంతో ఈ నెల 13న ఉరేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. మృతురాలి కొడుకు అజయ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.
సదాశివపేటలోవ్యక్తి
సదాశివపేట రూరల్(సంగారెడ్డి): చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. సదాశివపేట సీఐ వెంకటేశ్ తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని పెద్దాపూర్ శివారులో గల ఫ్లైఓవర్ సమీపంలో ఈనెల 11న ఓ గుర్తు తెలియని వ్యక్తి నడుచుకుంటూ వెళ్తుండగా, గుర్తు తెలియని ద్విచక్ర వాహనదారుడు ఢీకొట్టి వెళ్లాడు. ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అతడు చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రేపు జూడో క్రీడాకారుల ఎంపిక
రేపు జూడో క్రీడాకారుల ఎంపిక


