ఓటు వేయడానికి వెళ్తూ అనంతలోకాలకు..
● బైక్‌ను ఢీకొట్టిన రెడిమిక్స్ లారీ
● ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
● సంగారెడ్డి జిల్లాలో ఘటన
చిలప్‌చెడ్(నర్సాపూర్): స్థానిక సంస్థల ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించాలని డీఎ స్పీ (సీఐడీ) రవీందర్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రం చిలప్‌చెడ్ రైతువేదికలో మంగళవారం ఎన్నికల విధులపై పోలీసులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. ఎన్నికల నిర్వహణలో పోలీస్‌శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసిందన్నారు. పోలింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ఎలాంటి ఆవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత చర్యలు చేపట్టాలన్నారు.
రామచంద్రాపురం(పటాన్‌చెరు): గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయడానికి వెళుతూ రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా కొల్లూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం బండమీది తండాకు చెందిన పి.బీమా(34) తెల్లాపూర్ పరిధిలోని అంబేడ్కర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. హౌస్ కీపింగ్ అర్బన్ యాప్‌లో పని చేస్తూ పోలీసు ఉద్యోగం కోసం శిక్షణ తీసుకుంటున్నాడు. కాగా తన సొంత గ్రామంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయడానికి ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న తన అల్లుడు తరుణ్‌ను తీసుకుని బైక్‌పై గ్రామానికి బయలుదేరాడు. కొల్లూరు డబుల్ బెడ్రూం ఇళ్ల వెనుక గేట్ వద్ద వీరు ప్రయాణిస్తున్న బైక్‌ను రెడిమిక్స్ లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో బీమ్ అక్కడికక్కడే మృతి చెందగా తరుణ్ తీవ్రగాయాలపాలయ్యాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


