ఆడపిల్లల చదువుకు ఆర్థిక సాయం
● 20 మందికి రూ.4 లక్షలు అందజేత
● మేడ్వాన్ డైరెక్టర్ మధుసూదన్ రెడ్డి
సంగారెడ్డి: మేడ్వాన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో విజయ చిత్ర ఫౌండేషన్ బ్రదర్ ఆఫ్ గార్బల్ ప్రొవిజన్ వారి సహకారంతో ఆడపిల్లలు చదువుకోవడానికి మంగళవారం ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా మేడ్వాన్ డైరెక్టర్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ... నాలుగేళ్లుగా కరోనా బారిన పడి తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన 20 మంది ఆడపిల్లల విద్య కోసం రూ.4 లక్షల ఆర్థిక సహకారం అందించామని తెలిపారు. మెడ్వాన్ కార్యాలయంలో పిల్లల సంరక్షకులతో సమావేశం నిర్వహించి, ఆడపిల్లల విద్యను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో అనాథలైన బాలికలను గుర్తించి సహకారం అందిస్తున్నామన్నారు. విద్యార్థులు బాగా చదువుకొని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదిగి పేదవారికి సహాయం అందించాలని సూచించారు. అనంతరం 20 మంది విద్యార్థులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పిల్లల సంరక్షకులు, మెడ్వాన్ కోఆర్డినేటర్ ఎంఏ ముజీబ్,సిబ్బంది స్వప్న , హఫీజ్ , అమాదయ్య పాల్గొన్నారు.


