వ్యక్తి అదృశ్యం
చిన్నశంకరంపేట(మెదక్): నార్సింగి మండలం జప్తిశివనూర్ గ్రామానికి చెందిన కంతి పోచయ్య జోగిపేటకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లి తిరిగి రాలేదు. నార్సింగి ఎస్‌ఐ సృజన కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పోచయ్య ఆదివారం జోగిపేటలో ఓ వ్యక్తి వద్ద ఉన్న తన గొర్రెలను చూచి వస్తానని చెప్పి వెళ్లాడు. రాత్రి వరకు జోగిపేటకు చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులు గొర్రెల కాపరికి ఫోన్ చేసి అడగటంతో తమ వద్దకు రాలేదని చెప్పారు. దీంతో అతని కుమారుడు మల్లేశం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
అల్గోల్ గ్రామంలో...
జహీరాబాద్ టౌన్: వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఈ ఘటన మండలంలోని అల్గోల్ గ్రామంలో చోటు చేసుకుంది. జహీరాబాద్ టౌన్ ఎస్‌ఐ.వినయ్‌కుమార్ కథనం ప్రకారం... గ్రామానికి చెందిన మొండి బీరయ్య(49) కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు ఎవరికి చెప్పకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు అతడి ఆచూకీ కోసం గాలించినా ఫలితం లేదు. భార్య నర్సమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేశారు.
వ్యక్తి అదృశ్యం


