స్వేచ్ఛగా ఓటు వేయండి
నారాయణఖేడ్: మూడవ విడత పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. నారాయణఖేడ్ డివిజన్‌లోని కల్హేర్, కంగ్డి, నారాయణఖేడ్, మనూరు, నాగల్‌గిద్ద, నిజాంపేట్, సిర్గాపూర్‌తో పాటు జహీరాబాద్ డివిజన్‌లోని న్యాల్‌కల్ మండలంలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎన్నికల నిర్వహణ కోసం 1,769 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందుకోసం 2,477 మంది పోలింగ్ అధికారులు, ఓపీవోలు 2,762 మంది, 8 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించినట్లు చెప్పారు. 351 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ సౌకర్యం ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఓటర్లు ప్రలోభాలకు లోను కాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.


