బీఆర్‌ఎస్‌కు అధికారం ఖాయం
● ఎమ్మెల్యే కె.మాణిక్‌రావు
● నూతన సర్పంచ్‌లతో
కలిసి విజయోత్సవాలు
జహీరాబాద్: రెండు సంవత్సరాల తర్వాత ప్రజల ఆశీర్వాదంతో తిరిగి బీఆర్‌ఎస్ ప్రభుత్వం రానుందని ఎమ్మెల్యే కె.మాణిక్‌రావు అన్నారు. మంగళవారం జహీరాబాద్‌లోని క్యాంపు కార్యాలయంలో బీఆర్‌ఎస్ మద్దతుదారులైన సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులతో కలిసి విజయోత్సవాలను జరుపుకొన్నారు. ఈ సందర్భంగా విజేతలకు శాలువా, పూలమాలలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలు తిరిగి బీఆర్‌ఎస్ పాలన కోరుకుంటున్నారని చెప్పారు. ఇందుకు సర్పంచ్ ఎన్నికలే నిదర్శనమన్నారు. ప్రజలు బీఆర్‌ఎస్‌కే మద్దతు పలికారన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో అధికారం చేపట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గ్రామాల అభివృద్ధికి తన పూర్తి సహకారం ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఝరాసంగం, బర్దీపూర్, కొత్తూర్(బి), హోతి(బి), బూచనెల్లి, సత్వార్, అల్గోల్, గోవింద్‌పూర్, జాడీమల్కాపూర్, ధనాసిరి, విట్టునాయక్‌తండా గ్రామాలకు చెందిన సర్పంచ్‌లు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. సమావేశంలో మండల బీఆర్‌ఎస్ అధ్యక్షుడు తట్టు నారాయణ, మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షుడు సంజీవరెడ్డి, ఆత్మ మాజీ చైర్మన్ విజయ్‌కుమార్, బీఆర్‌ఎస్ నాయకులు మొహియొద్దీన్, మిథున్‌రాజ్ పాల్గొన్నారు.


