డుమ్మా కొట్టిన సిబ్బందిపై చర్యలు
● అదనపు కలెక్టర్ చంద్రశేఖర్
● సమస్యాత్మక కేంద్రాల వద్ద
అదనపు బలగాలు
నారాయణఖేడ్: మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు బందోబస్తును ఏర్పాట చేసినట్లు జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. నారాయణఖేడ్ పట్టణ శివార్లలోని మోడల్ డిగ్రీ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రం వద్ద మంగళవారం ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. పోలింగ్ సజావుగా నిర్వహించడం కోసం 40 శాతం అదనపు సిబ్బందిని నియమించామని అన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ డుమ్మాకొట్టిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల ప్రక్రియ సక్రమంగా నిర్వహించడం కోసం ఒక మండలానికి జిల్లా స్థాయి అధికారిని ప్రత్యేక అధికారులుగా నియమించి, డిస్ట్రిబ్యూషన్‌తో పాటు పోలింగ్, కౌంటింగ్ ఏర్పాట్లు సక్రమంగా జరిగే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. ప్రతీ మండలానికి ఒక మైక్రో ఆబ్జర్వర్‌ను కూడా నియమించామన్నారు.


