రక్త పరీక్షలు జరుగుతున్నాయా..? | - | Sakshi
Sakshi News home page

రక్త పరీక్షలు జరుగుతున్నాయా..?

Dec 13 2025 11:00 AM | Updated on Dec 13 2025 11:00 AM

రక్త

రక్త పరీక్షలు జరుగుతున్నాయా..?

రక్త పరీక్షలు జరుగుతున్నాయా..? జాతీయ పోటీలకు అశ్విక ఎంపిక మంత్రిని కలిసిన నూతన సర్పంచ్‌లు ఎన్కెపల్లి తొలి సర్పంచ్‌ ఎవరో..?

ప్రోగ్రాం మేనేజర్‌ నాగరాజు ఆరా

జహీరాబాద్‌: జహీరాబాద్‌లోని ఏరియా ప్రభుత్వాస్పత్రిని జిల్లా ప్రోగ్రాం మేనేజర్‌ (హెచ్‌ఐవీ) నాగరాజు శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఐసీటీసీ ల్యాబ్‌ను, రికార్డులను పరిశీలించారు. హెచ్‌ఐవీ కిట్స్‌ సక్రమంగా ఉన్నదీ లేనిదీ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అందరికీ రక్త పరీక్షలు జరుగుతున్నాయా అనే విషయమై రోగులను అడిగి ఆరా తీశారు. అందరూ ప్రభుత్వాస్పత్రిలోనే హెచ్‌ఐవీ పరీక్ష చేయించుకోవాలని సూచించారు. అనంతరం ఆస్పత్రి సూపరింటెండెంట్‌ శ్రీధర్‌ను కలిసి ఆస్పత్రి నిర్వహణకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో వైద్యులు నాగరాజ్‌ పాటిల్‌, శేషుబాబు, ల్యాడ్‌ టెక్నిషియన్‌ బండి సుధాకర్‌, కౌన్సిలర్‌ దండయ్యా పాల్గొన్నారు.

సదాశివపేట(సంగారెడ్డి): మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఈనెల 19వ తేదీ నుంచి అండర్‌–14, 22 వేయిట్‌ కేటరిగిలో జరగబోయే జాతీయ స్థాయి పోటీలకు పట్టణంలోని విజ్ఞాన్‌ మాడల్‌ స్కూల్‌ విద్యార్థిని కే.అశ్విక ఎంపికై ంది. వికారాబాద్‌ జిల్లా మోమిన్‌పేట మండలం మేకవనంపల్లిలో శుక్రవారం జరిగిన ఎస్‌జిఎఫ్‌ అండర్‌–14 బాలికల విభాగం నుంచి 22 వేయిట్‌ కేటగిరిలో అశ్విక బంగారు పతకం సాధించింది. కాగా, అశ్వికను తెలంగాణ స్టేట్‌ జేకే ఏ బోర్డు ఆఫ్‌ డైరక్టర్‌ శంకర్‌గౌడ్‌ అభినందించారు.

టేక్మాల్‌(మెదక్‌): మండలంలో నూతనంగా గెలిచిన సర్పంచ్‌లు శుక్రవారం వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహను సంగారెడ్డిలోని తన నివాసంలో కలిశారు. ఈసందర్భంగా మంత్రి వారికి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. ఈసందర్భంగా సర్పంచ్‌లు మంత్రి సన్మానించారు.

రాయికోడ్‌(అందోల్‌): మండలంలోని ఔరంగానగర్‌ గ్రామ పంచాయతీలో ఎన్కెపల్లి అనుబంధ గ్రామంగా ఉండేది. ఇటీవల ఎన్కెపల్లి గ్రామాన్ని గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో ఈ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వు అయింది. 323 మంది ఓటర్లు ఉండగా ఆరు వార్డులు ఉన్నాయి. 165 మంది పురుషులు కాగా 158 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. మండలంలో అతితక్కువ ఓట్లు ఉన్న గ్రామ పంచాయతీ ఎన్కెపల్లి, కాంగ్రెస్‌ పార్టీ మద్దతుదారురాలిగా మాణెమ్మ బీఆర్‌ఎస్‌ పార్టీ మద్దతుదారురాలిగా ఈశ్వరమ్మ సర్పంచ్‌ బరిలో నిలిచారు. గ్రామ ఓటర్లు తొలి సర్పంచ్‌ పదవి ఎవరికి కట్టబెడతారోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఉద్యాన డిగ్రీ

ప్రవేశాలకు ఆహ్వానం

ములుగు(గజ్వేల్‌): ఉద్యాన విశ్వవిద్యాలయంలోని డిగ్రీలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్‌ భగవాన్‌ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 17న ఉదయం 10:30 నుంచి ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం కంబైన్డ్‌ కౌన్సెలింగ్‌ కు దరఖాస్తు సమర్పించాలన్నారు. ఎప్‌సెట్‌ –2025లో ర్యాంకు పొందిన విద్యార్థులు ఈ కౌన్సెలింగ్‌ కు హాజరు కావచ్చన్నారు. విశ్వవిద్యాలయం పరీక్షా కేంద్రంలో కౌన్సిలింగ్‌ నిర్వహించడం జరుగుతుందన్నారు. మరిన్ని వివరాలకు 96524 56779 నంబర్‌ ద్వారా సంప్రదించాలని ఆయన కోరారు.

రక్త పరీక్షలు  జరుగుతున్నాయా..?
1
1/2

రక్త పరీక్షలు జరుగుతున్నాయా..?

రక్త పరీక్షలు  జరుగుతున్నాయా..?
2
2/2

రక్త పరీక్షలు జరుగుతున్నాయా..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement