నేడు నవోదయ ప్రవేశ పరీక్ష
● నవోదయ పరీక్షకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 4754 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. వివిధ ప్రాంతాలలో 22 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.
● సిద్దిపేట జిల్లాలో 7 పరీక్ష కేంద్రాలు, మెదక్ జిల్లాలో 6, సంగారెడ్డి జిల్లాలో 9 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.
● కాపీయింగ్‌కు తావీయకుండా సజావుగా పరీక్ష నిర్వహణకు ప్రతి కేంద్రంలో సెంటర్ సూపరిండెంట్, సెంటర్ లెవల్ అబ్జర్వర్‌ను నియమించారు. యంత్రాంగానికి జిల్లా కేంద్రాల్లో శిక్షణ కూడా ఇచ్చారు.
● 24 మంది విద్యార్థులకు ఒక గది, ఒక ఇన్విజిలేటర్ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. కేంద్రాలపై పర్యవేక్షణ బాధ్యతను మండల విద్యాధికారులకు అప్పగించారు. జిల్లా స్థాయి ఆబ్జర్వర్లుగా డీఈఓలు, నవోదయ ప్రిన్సిపాల్‌ఉంటారు.
● ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. ఆతృత, ఒత్తిడి అధిగమించేందుకు పరీక్ష నిర్వహణకు గంట ముందే విద్యార్థులు కేంద్రానికి చేరుకోవాలి.
ఉమ్మడి జిల్లాలో 4,754 మంది విద్యార్థులు 22 పరీక్ష కేంద్రాలు పరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
వర్గల్(గజ్వేల్): ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా శనివారం నవోదయ ప్రవేశ పరీక్ష నిర్వహణకు యంత్రాంగం సన్నద్ధమైంది. 2026–27 విద్యాసంవత్సరంలో ఆరోతరగతి ప్రవేశానికి నిర్వహిస్తున్న ఈ పరీక్ష కోసం సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాల విద్యాశాఖ అధికారులు, వర్గల్ నవోదయ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులకు, అభ్యర్థులకు అనుమానాలు నివృత్తి చేసేందుకు ‘హెల్ప్‌డెస్క్’ ఏర్పాటు చేశారు.
24 మందికి ఒక ఇన్విజిలేటర్
గంట ముందే కేంద్రానికి చేరుకోవాలి
సమాచారం కోసం హెల్ప్‌డెస్క్
నవోదయ ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు అవసరమైన సమాచారం, అనుమానాల నివృత్తి కోసం శ్రీనివాస్‌రావు: 73823 35164, ఎంజీ సోనీ: 94489 01318 హెల్ప్‌డెస్క్ నెంబర్లలో సంప్రదించవచ్చు.