యువతి అదృశ్యం
శివ్వంపేట(నర్సాపూర్): మండల పరిధి రత్నాపూర్‌లో యువతి అదృశ్యమైన ఘటన చోటు చేసుకుంది. ఎస్‌ఐ మధుకర్‌రెడ్డి తెలిపిన వివరాలు ప్రకారం.. గ్రామానికి చెందిన బొగ్గుల వెంకటేశ్ కూతురు శ్రావణి గురువారం అదే గ్రామంలో ఉన్న అమ్మమ్మ ఇంటికి వెళ్తానని చెప్పి బయటకు వెళ్లింది. కానీ ఆమె అక్కడికి వెళ్లలేదని తెలుసుకొన్న ఆ కుటుంబ సభ్యులు స్నేహితులు, బంధువుల ఇళ్లలో వెతికారు. అయినా ఆచూకీ లభించకపోవడంతో యువతి తండి వెంకటేశ్ శుక్రవారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ చెప్పారు.


