వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురికి గాయాలు
ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొట్టిన లారీ
శివ్వంపేట(నర్సాపూర్): ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని చిన్నగొట్టిముక్కుల గ్రామ శివారులో తూప్రాన్, నర్సాపూర్ హైవేపై మంగళవారం అర్థరాత్రి జరిగింది. తూప్రాన్ నుంచి నర్సాపూర్ వైపు వెళుతున్న లారీ ముందు ఆగి వున్న బియ్యం లారీని ఢీకొట్టింది. దీంతో డ్రైవర్‌తోపాటు మరో ఇద్దరికి గాయాలయ్యాయి. బాధితులను పోలీసులు నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.
బైక్ అదుపుతప్పి...
జహీరాబాద్ టౌన్: పట్టణ సమీపంలో పస్తాపూర్ వద్ద జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. కర్నాటక రాష్ట్రంలోని బీదర్ పట్టణానికి చెందిన శ్రీనాథ్, మల్కాజిగిరికి చెందిన నందిని, శిరిష మోటారు బైక్‌పై హైదరాబాద్‌కు వెళుతున్నారు. 65వ జాతీయ రహదారిపై పస్తాపూర్ శివారులో బైక్ అదుపుతప్పి కింద పడింది. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురికి గాయాలయ్యాయి. పెట్రోలింగ్ సిబ్బంది గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స చేసి అనంతరం మెరుగైన వైద్యం కోసం వారిని హైదరాబాద్‌కు తరలించారు. జహీరాబాద్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
గేదెను ఢీకొని..
చేగుంట(తూప్రాన్): రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని కరీంనగర్ గ్రామ శివారులో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. కరీంనగర్ నుంచి చేగుంట వైపునకు ద్విచక్ర వాహనంపై వెళుతున్న యువకుడు గేదెను ఢీకొని పడిపోయాడు ఈ ప్రమాదంలో అతడికి తీవ్ర గాయాలు కాగా స్థానికులు తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరళించారు. యువకుడు కొరియర్ బాయ్‌గా పనిచేసే హరీష్‌గా గుర్తించారు.
సంగారెడ్డి టౌన్: గ్రామీణ ప్రాంతంలోని మహిళా సంఘాల సభ్యులు ఆర్థికంగా బలోపేతం చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రకాల పథకాలను అమలు చేస్తున్నాయి. మహిళా సంఘాల ఉపాధికి బాటలు వేయడంతో పాటు వారిని వ్యాపార, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు సీ్త్రనిధి, బ్యాంకు లింకేజీ ద్వారా వివిధ రూపాలలో రుణాలను అందిస్తుంది. ఇందులో భాగంగా మహిళా సంఘాల సభ్యులు జనరిక్ మందుల దుకాణాలు ఏర్పాటు చేసుకునేలా అవకాశం కల్పించారు. తద్వారా మహిళలు ఆర్థికంగా బలోపేతం చేయడమే కాకుండా నిరుపేదలకు తక్కువ ధరకు మందులు అందజేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే గ్రామీణాభివృద్ధిశాఖ ద్వారా సీ్త్రనిధి రుణాలు మంజూరు చేసి జనరిక్ మందుల దుకాణాలను ఏర్పాటు చేయనున్నారు. దీని కోసం ప్రతిపాదనలు కూడా సిద్ధమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 695 గ్రామ సంఘాలు ఉండగా, 25 మండల సమాఖ్య మహిళా సంఘాలు, అందులో ఒక లక్ష 95 వేల మహిళా సంఘాల సభ్యులు ఉన్నారు.
తక్కువ ధరలకు మందులు అందించేందుకే..
గ్రామీణ ప్రాంతాల్లో పని చేయనిదే పూటగడవని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. కుటుంబపోషణ భారంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబంలో ఎవరైనా అనారోగ్యానికి గురైతే వారు పడే ఇబ్బందులు వర్ణానాతీతం. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లినా ఎక్కువ శాతం మందులు బయట దుకాణాల్లో కొనాల్సి రావడంతో వారికి భారీ వ్యయం తప్పడం లేదు. ఈ పరిస్థితుల్లో తక్కువ ధరలకు మందులు అందించాలనే ఉద్దేశఃతో ప్రభుత్వం మండలాల్లో జనరిక్ మందుల దుకాణాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
రూ.3లక్షల రుణం
జిల్లా వ్యాప్తంగా జనరిక్ మందుల దుకాణాలను అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా యంత్రాంగం ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా మహిళా సంఘాల సభ్యుల్లో అర్హులైన వారికి జనరిక్ దుకాణాల ఏర్పాటుకు సీ్త్రనిధి ద్వారా రుణాలు ఇచ్చి ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఒక్కో దుకాణం ఏర్పాటుకు రూ.3లక్షల రుణం అందించనున్నారు. తొలుత మండలానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
అర్హతలివే..
జనరిక్ మందుల దుకాణం ఏర్పాటుకు స్వయం సహాయక సంఘాల్లో సభ్యురాలై ఉండాలి. వారి దగ్గరి బంధువుల్లో ఎవరైన డీ ఫార్మసీ, బీ ఫార్మసీ, ఎం.ఫార్మసీ విద్యార్హత కలిగి ఉండాలి. రుణం పొందడానికి ముందు సభ్యురాలిగా ఉన్న సంఘం సమైఖ్య సంఘం తీర్మానం తప్పనిసరి. దుకాణం నిర్వహణకు సంబంధిత డ్రగ్ ఇన్‌స్పెక్టర్ అనుమతి, ధ్రువీకరణ పత్రాలతో సీ్త్రనిధి అధికారులకు దరఖాస్తు చేయాలి. వారు దరఖాస్తులను పరిశీలించి అర్హులుగా భావిస్తే వివరాలను సంబంధిత వెబ్‌సైట్‌లో నమోదు చేస్తారు. జనరిక్ దుకాణం ఏర్పాటు కోసం తీసుకునే రుణాన్ని ఐదేళ్లలోపు ప్రతీనెల వాయిదాల రూపంలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురికి గాయాలు
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురికి గాయాలు


