రైతులకు ఇబ్బందిలేకుండా కొనుగోళ్లు
కొల్చారం (నర్సాపూర్): ధాన్యం కొనుగోలు జరిపే క్రమంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోళ్లు జరపాలని మెదక్ కలెక్టర్ రాహుల్‌రాజ్ మండలంలోని సంగాయిపేట గ్రామ ధాన్యం కొనుగోలు కేంద్రం సిబ్బందిని ఆదేశించారు. కొను గోలు కేంద్రాన్ని బుధవారం సందర్శించిన కలెక్టర్ ధాన్యం తేమశాతాన్ని పరిశీలించారు. రోజువారీ కొనుగోళ్లకు సంబంధించిన రిజిస్టర్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..రైతులు తెచ్చిన ధాన్యాన్ని వెంటనే తేమశాతం ఎంత ఉందన్న విషయమై రిజిస్టర్లో నమోదు చేయాలన్నారు. నిర్దేశించిన తేమశాతం వచ్చిన వెంటనే కేటాయించిన మిల్లులకు ధాన్యాన్ని లోడ్ చేసి రవా ణ చేయాలన్నారు. కేంద్రాల్లో పనిచేస్తున్న సిబ్బంది సన్న,దొడ్డు రకం ధాన్యంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. గతంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఇచ్చిన శిక్షణ కార్యక్రమానికి హాజరైన వారే ధాన్యం కొనుగోలు ప్రక్రియ నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమంలో సంఘం చైర్మన్ వెంకట్రామ్‌రెడ్డి, సిబ్బంది ఉన్నారు.
మెదక్ కలెక్టర్ రాహుల్‌రాజ్


