శివ్వాయిపల్లిలో తల్లీకూతురు అంత్యక్రియలు
హవేళిఘణాపూర్(మెదక్): కర్నూల్ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో సజీవ దహనమైన మెదక్ మండలం శివ్వాయిపల్లికి చెందిన తల్లీకూతురు సంధ్యారాణి, చందన అంత్యక్రియలను సోమవారం స్వగ్రామంలో నిర్వహించారు. కర్నూల్ నుంచి మృతదేహాలను అంబులెన్సులో ఆదివారం రాత్రి శివ్వాయిపల్లికి తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న మెదక్ బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మ, బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్, వైఎస్‌ఆర్‌సీపీ ఉమ్మడి మెదక్ జిల్లా మాజీ అధ్యక్షుడు డప్పు రాజు నివాళులర్పించారు.
మిన్నంటిన రోదనలు
ఒకే ఇంట్లో తల్లీకూతురు మృతి చెందడంతో కనీసం కడసారి చూపు కూడా నోచుకోకపోవడంతో బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. సంధ్యారాణికి కుమారుడు ప్రహ్లాద్, చందనకు తండ్రి ఆనంద్‌గౌడ్ అంత్యక్రియలు నిర్వహించారు.
దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే


