● కలెక్టర్ ప్రావీణ్య పర్యవేక్షణలోలక్కీ డ్రా ప్రక్రియ ●
ఆరోవంతు ట్యాక్స్ చెల్లింపునకుఈ రోజే గడువు
జిల్లాలో ఉన్న 101 షాపుల్లో నాలుగు రకాల ఎకై ్సజ్ ట్యాక్ (యానివల్ రెంటల్) కేటగిరీలు ఉన్నాయి. రూ.50 లక్షలు, రూ.55 లక్షలు, రూ.60 లక్షలతో పాటు, జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న పటాన్‌చెరు ఎకై ్సజ్‌స్టేషన్ పరిధిలోని షాపులకు రూ.1.10 కోట్లుగా ఎకై ్సజ్‌ట్యాక్ ఉంది. లక్కీ డ్రాలో ఈ షాపులు దక్కించుకున్న వారు ఆయా షాపునకు నిర్దేశించిన ఈ ఎకై ్సజ్ ట్యాక్సులో 1/6 వంత వెంటనే చెల్లించాలి. అంటే మంగళవారం లోపు ఈ మొత్తాన్ని బ్యాంకులో చెల్లించిన వారికే ఈ షాపు దక్కుతుంది. ఉదహరణకు రూ.60 లక్షల యానివల్ రెంటల్ ఉన్న షాపులకు సుమారు రూ.పది లక్షలు చెల్లించాలి. ఈ ట్యాంకును చెల్లించే వారి సౌకర్యం కోసం సంగారెడ్డిలోని స్టేట్‌బ్యాంకు మెయిన్ బ్రాంచ్‌కు సోమవారం రాత్రి 8 గంటల వరకు స్టేట్‌బ్యాంకును తెరిచి ఉంచేలా జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది.
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఈసారి మద్యం దుకాణాలను మహిళలు భారీగానే దక్కించుకున్నారు. జిల్లాలో దాదాపు మూడో వంతు షాపులు వారికే వచ్చాయి. జిల్లాలోని మొత్తం 101 మద్యం దుకాణాలకుగాను సోమవారం 100 దుకాణాలకు కలెక్టర్ ప్రావీణ్య పర్యవేక్షణలో లక్కీ డ్రా నిర్వహించారు. ఇందులో మొత్తం 32 షాపులు మహిళలకు దక్కడం గమనార్హం. మిగిలిన 69 షాపులు పురుషులకు దక్కాయి. అయితే మద్యం వ్యాపారులకు తమ కుటుంబసభ్యుల్లోని మహిళల పేర్లతో దరఖాస్తు చేసుకుంటే అదృష్టం వరిస్తుందనే సెంటిమెంట్ ఉంటుంది. ఇలా చాలా మంది మద్యం వ్యాపారులు తమ కుటుంబసభ్యుల్లోని మహిళల పేర్లతో దరఖాస్తులు చేయించారు. దీంతో ఈ మహిళలకు మూడో వంతు షాపులు దక్కాయి. కాగా ఈసారి కూడా మద్యం షాపులు పాత వ్యాపారులకే ఎక్కువగా దక్కాయి. వందలో సుమారు 70కి పైగా షాపులు పాత వారినే వరించినట్లు ఎకై ్సజ్ వర్గాలు చెబుతున్నాయి. కొత్తగా ఈ వ్యాపారంలోకి అడుగుపెట్టిన వారికి నామమాత్రపు సంఖ్యలో షాపులు వచ్చాయి. జిల్లాలో 101 మద్యం షాపులకు గాను 4,432 దరఖాస్తులు వచ్చిన విషయం విదితమే.
తక్కువ దరఖాస్తులు వచ్చాయని..
జిల్లాలోని మునిపల్లి మండలం తాటిపల్లిలో ఉన్న మద్యం షాపు లక్కీ డ్రాను అధికారులు వాయిదా వేశారు. ఈ షాపునకు 19 దరఖాస్తులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎకై ్సజ్ అధికారులు పేర్కొన్నారు. గతసారి ఈ షాపునకు 46 దరఖాస్తులు రాగా, సగానికిపైగా దరఖాస్తుల సంఖ్య తగ్గడంతో ఈ షాపు లక్కీడ్రాను వాయిదా వేశారు. రెండేళ్లుగా ఈ మద్యం షాపులో అమ్మకాలు కూడా బాగానే ఉన్నప్పటికీ.. దరఖాస్తుల సంఖ్య తక్కువగా ఉండటంతో లక్కీడ్రాను వాయిదా వేయాలని నిర్ణయించారు. కాగా ఆందోల్ ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో 18 దరఖాస్తులు వచ్చినా లక్కీ డ్రా నిర్వహించారు. నిర్దేశించిన క్రైయిటీరిలో తాటిపల్లి షాపునకు దరఖాస్తుల సంఖ్య లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎకై ్సజ్ అధికారులు చెబుతున్నారు.
మూడు పర్యాయాలు ఒకే సిండికేట్‌కు..
మద్యం షాపుల లక్కీడ్రాలో చిత్రాలు చోటు చేసుకున్నాయి. సదాశివపేటలోని ఓ మద్యం షాపు రెండు పర్యాయాలు దాదాపు నాలుగేళ్లు పైగా ఒకే సిండికేట్ గ్రూపునకు దక్కుతోంది. ఈసారి కూడా ఈ షాపు ఇదే సిండికేటును వరించడం చర్చనీయాంశంగా మారింది. అలాగే నారాయణఖేడ్‌కు చెందిన మరో సిండికేట్‌కు మూడు మద్యం షాపులు దక్కడంతో సిండికేట్ గ్రూపులోని సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.


