కోతకు వచ్చే వరకు జాగ్రత్త
కంది పంట ఆశాజనకంగా ఉంది. కోతకు వచ్చే వరకు పంటను కాపాడుకుంటే మంచి దిగుబడులు వస్తాయి. మబ్బుల వల్ల కంది పంటకు నష్టం కల్గుతుంది. ఆకాశం మేఘావృతమైతే మబ్బులు కమ్మి తెగుళ్లు ఆశిస్తాయి. పూత, కాత దశలో ఉన్న కంది పంటలో ఆకు చుట్టూ పురుగులు, మారుకా మచ్చలపురుగు, కాయతొలుచు పురుగు, ఎండు తెగులు, గొడ్డు మోతు తెగులు, రసం పీల్చే పురుగులు, పూత పెంకు పురుగులు, శనగ పచ్చపురుగులు ఆశించి దిగుబడిపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయన్నాయి. వ్యవసాయ అధికారుల సూచన మేరకు సస్యరక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.
– భిక్షపతి, ఏడీఏ, జహీరాబాద్


