రేపు డయల్ యువర్ డీఎం
నారాయణఖేడ్: ఖేడ్ ఆర్టీసీ డిపోలో ఈనెల 29న ఉదయం 10: 30 గంటల నుంచి 11:30 గంటల వరకు డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆర్టీసీ డీఎం సుబ్రహ్మణ్యం తెలిపారు. డిపో పరిధిలోని గ్రామాల ప్రయాణికులు, ప్రజలు ఆర్టీసీకి సంబంధించి 9959223170 నంబర్‌కు ఫోన్ చేసి సలహాలు, సూచనలు, సమస్యలు చెప్పాలన్నారు.
మెను ప్రకారం భోజనం
అందిస్తున్నారా..?
సబ్ కలెక్టర్ ఉమాహారతి
కంగ్టి(నారాయణఖేడ్): మండల కేంద్రంలోని వసతిగృహాలను సబ్ కలెక్టర్ ఉమా హారతి సోమవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. గిరిజన సంక్షేమ జూనియర్ కళాశాల, కస్తూర్బా విద్యాలయం, బీసీ వెల్ఫేర్ బాలుర, ఎస్సీ వెల్ఫేర్ బాలుర వసతి గృహాలను ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్బంగా విద్యార్థుల హాజరుశాతం పరిశీలించి, మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. జూనియర్ కళాశాలలో హైమాస్ట్ లైట్లను ఏర్పాటు చేయాలని విద్యార్థులు అడిగారు. తాగునీటి సరఫరాపై వార్డన్‌ను అడిగి తెలుసుకున్నారు. ప్రిన్సిపాల్ విజయ్‌కుమార్, వార్డెన్ శివకుమార్, పీడి మహేశ్వరి, డబ్ల్యూహెచ్‌ఓ పండరి, సురేష్‌లు తదితరులున్నారు.
మూడు రోజులునీటి సరఫరా బంద్
జహీరాబాద్ టౌన్: నీటి శుద్ధి కర్మాగారంలో మరమ్మతుల కారణంగా ఈ నెల 28వ తేదీ నుంచి మూడు రోజుల పాటు మిషన్ భగీరథ నీటి సరఫరా బంద్ ఉంటుందని ఈఈ విజయలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. సింగూరు ఆనకట్ట వద్ద ఉన్న బూసరెడ్డిపల్లి 100 ఎంఎల్టీ శుద్ధి కర్మాగారంలో మరమ్మతులు చేపడుతున్నట్లు చెప్పారు. దీంతో జహీరాబాద్, ఝరాసంగం, మొగుడంపల్లి, కోహీర్, మున్సిపల్లి, సంగారెడ్డి, సదాశివపేట, కొండపూర్, తెల్లపూర్, పటాన్‌చెరువు మున్సిపాలిటి పరిధిలో మూడు రోజుల పాటు నీటి సరఫరా ఉండదన్నారు. ప్రజలు సహకరించాలని ఆమె కోరారు.
కానిస్టేబుల్‌నుసస్పెండ్ చేయాలి
ఎస్‌జీటీయూ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్
హత్నూర(సంగారెడ్డి): ప్రభుత్వ పాఠశాల మహిళ ప్రధానోపాధ్యాయురాలిపై కానిస్టేబుల్ దాడి చేయడం అప్రజాస్వామికమని ఎస్‌జీటీయూ జిల్లా అధ్యక్షుడు ఆకుల ప్రభాకర్ అన్నారు. సోమవారం హత్నూర మండలం తెల్లరాళ్ల తండా పాఠశాల ఆవరణలో నల్లబ్యాడ్జీలు ధరించి ఉపాధ్యాయులతో కలసి ఆయన నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వనపర్తి జిల్లా రేవల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయినిపై కానిస్టేబుల్ దాడి చేయడం ఏమిటని ప్రశ్నించారు. సదరు కానిస్టేబుల్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
గో రక్షకులపై దాడులు అరికట్టాలి
సంగారెడ్డి: విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో గోరక్షకులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ సోమవారం చౌటకూర్ తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్‌కు వినతి పత్రం ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే గోరక్షకులపై దాడులు చేస్తున్న దుండగులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బజరంగ్ దళ్ సంగారెడ్డి జిల్లా సంయోజక్ పల్లె ప్రభుకుమార్ గౌడ్, చౌటకూర్ మండల గోరక్ష ప్రముఖ చంద్రశేఖర్, బీజేవైఎం మండల అధ్యక్షుడు మర్రి మహేశ్, నాయకులు ఇతర నాయకులు పాల్గొన్నారు.
రేపు డయల్ యువర్ డీఎం
రేపు డయల్ యువర్ డీఎం


