● కార్తీక కాంతులు
లక్ష దీపోత్సవంలో
పాల్గొన్న మహిళలు
కార్తీక మాసం పురస్కరించుకొని నారాయణఖేడ్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం మైదానంలో లలితాదేవి వైభవం ట్రస్టు ఆధ్వర్యంలో సోమవారం శ్రీదేవి, భూదేవి సమేత లక్ష్మీవెంకటేశ్వర కల్యాణం, లక్ష దిపోత్సవం వైభవంగా నిర్వహించారు. రాంపూర్ ఆశ్రమ పీఠాధిపతి మాధవానంద సరస్వతీ స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లక్ష్మీవెంకటేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలను భక్తుల మధ్య ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ సందర్భంగా చిన్నారులు చేసిననృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. – నారాయణఖేడ్
● కార్తీక కాంతులు


