అతిగా మద్యం తాగి వ్యక్తి మృతి
చిన్నశంకరంపేట(మెదక్): అతిగా మద్యం తాగి వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని గవ్వలపల్లి చౌరస్తాలోని వైన్స్ ఎదురుగా ఆదివారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ నారాయణ గౌడ్ కథనం మేరకు... మండలంలోని అంబాజిపేట గ్రామానికి చెందిన బండారు వెంకటేశం(40) శనివారం రాత్రి ఓ వైన్స్ దుకాణంలో మద్యం కొనుగోలు చేసి పక్కనే ఉన్న పర్మిట్ రూమ్‌లో తాగాడు. అక్కడి నుంచి బయటకు వచ్చిన అతను ఇంటికి వెళ్లలేదు. ఆదివారం ఉదయం చూస్తే వైన్స్ సమీపంలో వెంకటేశం మృతి చెంది కనిపించాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కాగా కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.


